Chandrababu:రిచ్చెస్ట్ సీఎంగా చంద్రబాబు

2
- Advertisement -

దేశంలో రిచెస్ట్ సీఎంగా నిలిచారు ఏపీ సీఎం చంద్రబాబు. దేశంలో సంపన్న ముఖ్యమంత్రుల జాబితాను అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్), నేషనల్ ఎలక్షన్ వాచ్ (న్యూ) సంయుక్తంగా విడుదల చేశాయి.

ఈ జాబితాలో తొలి మూడు స్థానాల్లో ఏపీ సీఎం చంద్రబాబు , అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పేమా ఖండూ, కర్ణాటక సీఎం సిద్దరామయ్య నిలిచారు. చంద్రబాబు ఆస్తులు రూ. 931 కోట్లు కాగా.. పేమా ఖండూ ఆస్తులు రూ.332 కోట్లు. అదేవిధంగా కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఆస్తుల విలువ రూ. 51 కోట్లుగా నివేదిక పేర్కొంది.

చంద్రబాబు పేరిట రూ.36కోట్ల ఆస్తులుండగా, ఆయన సతీమణి భువనేశ్వరి పేరట రూ.895 కోట్ల ఆస్తులున్నాయి. ఇందులో హెరిటేజ్ ఫుడ్స్ లో ఉన్న షేర్లనూ కలిపి నివేదిక లెక్కించింది.తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆస్తులు రూ. 30 కోట్లకుపైగానే ఉన్నాయి. జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా పేరిట రూ. 55లక్షలు, కేరళ ముఖ్యమంత్రి పినరయీ విజయన్ పేరిట రూ.1.18కోట్ల ఆస్తులు ఉన్నట్లు నివేదిక పేర్కొంది.

31 మంది ముఖ్యమంత్రుల్లో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం అతిశీ మహిళా ముఖ్యమంత్రులు. డజను మంది సీఎంలు 51-60 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన వారు కాగా.. ఆరుగురు ముఖ్యమంత్రులు 71ఏళ్లు పైబడిన వారు.

Also Read:సీఎం చంద్రబాబుకు థ్యాంక్స్ చెప్పిన రేవంత్

- Advertisement -