పసలేని పనికిమాలిన కేసులు: కేటీఆర్

14
- Advertisement -

పసలేని కేసులు పనికిమాలిన కేసులను ప్రభుత్వం పెడుతుందని మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ భవన్‌లో మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడిన కేటీఆర్…అవినీతి జరగనే లేనప్పుడు అవినీతి నిరోధక శాఖ పేరుతో కేసులు పెడుతుందన్నారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టిన న్యాయపరంగా ఎదుర్కొంటాం…ప్రభుత్వం తమ అధికార యంత్రాంగం చేతిలో ఉందని అడ్డగోలుగా కేసులు పెట్టినా ఎదుర్కొంటాం అన్నారు.

తాను మొదటి రోజు చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నా… ప్రభుత్వ నిర్ణయంగా ఒక మంత్రిగా నిర్ణయం తీసుకున్న అదే మాటకు నేను కట్టుబడి ఉన్నాను అన్నారు. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పిన మాటల్లోనే అవినీతి జరగలేదని చెప్పారు…అవినీతి ఎక్కడ ఉందని ముఖ్యమంత్రినీ అడిగితే చెప్పలేని పరిస్థితి ఉందన్నారు. ముఖ్యమంత్రి ఫార్ములా ఈ ప్రతినిధులతో కలిసిన ఫోటో బయట పెట్టడంతో ముఖ్యమంత్రి అధికారులను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు…సస్పెండ్ చేస్తాను క్రమశిక్షణ చర్యలు తీసుకుంటానని బెదిరిస్తున్నాడు అన్నారు.

మరి ఫార్ములా ఈ వాళ్లతో కలిసిన రేవంత్ రెడ్డి వాళ్లపైన ఎందుకు కేసు పెట్టలేదు…వాళ్లతో జరిగిన సమావేశాన్ని ఒక సంవత్సరం పాటు దాచి ఉంచాడు అన్నారు. వాళ్లతో డబ్బులు తీసుకున్నాడని అనుమానం ఉంది…అనుచిత లబ్ధి పొందింది ఫార్ములా ఈ సంస్ధ వాస్తవమైతే వాళ్లపైనే ఎందుకు కేసు పెట్టలేదు అన్నారు. ముఖ్యమంత్రి 600 కోట్లు అంటూ అడ్డగోలుగా అబద్ధాలు మాట్లాడుతున్నాడు …అతనితో కాంటాక్ట్లను రద్దు చేసుకోలేము అని చెబుతున్న ముఖ్యమంత్రి ఫార్ములా ఈ ని ఏ విధంగా రద్దు చేసుకున్నాడు చెప్పాలన్నారు. దీనికి ఏమన్నా క్యాబినెట్ అప్రూవల్ ఉన్నదా…ప్రొసీజర్ పొరపాట్లు ఉంటే సంబంధిత సంస్థల దగ్గరికి వెళ్ళాలి కానీ అవినీతి కేసులు అని పెట్టడం వృధా అన్నారు.

హైదరాబాద్ పేరు ప్రతిష్ట తెలంగాణ రాష్ట్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిలిపేందుకు హైదరాబాద్ నుంచి ఫార్ములా ఈ రేసు పోవద్దన్న ఉద్దేశంతోనే డబ్బులు కట్టాం..
ఈ మొత్తం వ్యవహారంలో ఒక్క రూపాయి అవినీతి కూడా అవకాశమే లేదు అన్నారు. ఒక పైసా అవి జరగలేదు కోర్టులో విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఈ అంశం లో మరిన్ని విషయాలు చెప్పలేను…ఏసిబి ఎఫ్ఐఆర్ ని కొట్టివేయలని హైకోర్టులో కేసు నమోదు చేశాను అన్నారు.అయితే ఇదే అంశం పైన ఇది ఏసీబీ ఆధారంగా కేసు నమోదు చేసింది…ఇది నోటీసులు వచ్చిన మాట వాస్తవమే… కానీ ఈ ఎఫ్ఐఆర్ హైకోర్టు కొట్టి వేస్తే ఏం జరుగుతుందో చూడాలి అన్నారు.

ఇతర కేసుల్లో మాదిరి కాకుండా ఈ కేసులో ఈడి దూకుడుగా వ్యవహరిస్తుంది…. ఏం జరుగుతుందన్నది చూడాలి, ఔటర్ రింగ్ రోడ్డు పైన ఆరోపణ చేస్తున్న ప్రభుత్వం వెంటనే ఔటర్ రింగ్ రోడ్ రిలీజ్ రద్దు చేయాలన్నారు. అవినీతి జరిగిందని ఆరోపించినప్పుడు ప్రభుత్వం లీజును ఎందుకు రద్దు చేయట్లేదు ముఖ్యమంత్రి చెప్పాలి..నాపైన ఇప్పటికే అనేక కేసులను రాష్ట్రవ్యాప్తంగా నమోదు చేసిందన్నారు. రేవంత్ రెడ్డి ఇప్పటికే అనేకసార్లు వివిధ రకాల కేసులు పెట్టి జైలుకు పంపాలని ప్రయత్నం చేసిండు..అనేక రకాల అంశాలు లేవనెత్తుతున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం.. ఈ మొత్తం వ్యవహారంలో నాకు డబ్బులు ఎట్లా వచ్చినయో చెప్పాలన్నారు.

అనుమానాలపైన కేసులు ఉండవు కేవలం ఆధారాలపైన మాత్రమే కేసులు ఉంటాయి…రేవంత్ రెడ్డి చెప్తున్నా అబద్దాలను అసత్యాలను మీడియా యధాతధంగా ప్రచురితం చేస్తుందన్నారు. అసెంబ్లీలో కూడా అబద్ధాలు మాట్లాడుతున్న నీచపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రివర్గంలో ఉన్న మంత్రులు కూడా రాష్ట్ర అప్పుల పైన ఒక్కొక్క అబద్ధాన్ని అసెంబ్లీలో మాట్లాడారు అన్నారు. రేవంత్ రెడ్డికి కాదు రేవంత్ రెడ్డి తాతకు కూడా భయపడను అని తేల్చిచెప్పారు.

Also Read:గేమ్ ఛేంజర్..అతిథిగా ఏపీ డిప్యూటీ సీఎం

- Advertisement -