10 లక్షల యుఎస్ వీసాలు!

5
- Advertisement -

అగ్రరాజ్యం అమెరికా వరుసగా రెండో ఏడాది 10 లక్షలకు పైగా వలసేతర వీసా(నాన్‌ ఇమిగ్రెంట్‌)లను మంజూరు చేసినట్లు అమెరికా కాన్సులేట్‌ తెలిపింది. భారత్‌తో బలమైన ద్వైపాక్షిక సంబంధాలు పెంపొందించేందుకు, అసాధారణమైన కాన్సులర్‌ సేవలు అందించేందుకు అమెరికా మిషన్‌ అంకితభావంతో పనిచేస్తున్నట్లు పేర్కొంది.

ఈ ఏడాది జనవరి నుంచి నవంబరు వరకు దాదాపు 20 లక్షల మంది భారతీయులు అమెరికా ప్రయాణాలు చేశారు. ఇది 2023తో పోల్చితే దాదాపు 26% ఎక్కువ. మరో 50 లక్షల మంది యూఎస్‌ను సందర్శించడానికి వలసేతర వీసాలు పొంది ఉన్నారు.

అమెరికాలో నివసిస్తున్న, భారత పర్యటనకు వచ్చిన అమెరికన్‌ పౌరులకు 24 వేలకు పైగా పాస్‌పోర్టుల జారీ, ఇతర కాన్సులర్‌ సేవలను భారత్‌లోని యూఎస్‌ మిషన్‌ అందించింది. దాదాపు 3,31,000 మంది భారతీయులు అమెరికాలో ఉన్నత విద్య చదువుతున్నారు. వరుసగా రెండో ఏడాది అంతర్జాతీయ పట్టభద్ర విద్యార్థులను అధికంగా పంపించే దేశంగానూ భారత్‌ నిలిచింది.

Also Read:పెళ్లి రోజు..11 మంది అనాధల దత్తత

- Advertisement -