- Advertisement -
తిరుమలకు వస్తున్న తెలంగాణ భక్తులు నిర్లక్ష్యానికి గురవుతున్నారు అన్నారు మంత్రి కొండా సురేఖ. గత ప్రభుత్వ హయాం నుంచి మా తెలంగాణ భక్తులు నిర్లక్ష్యానికి గురవుతున్నారు అని ఆరోపించారు.
తెలంగాణ భక్తుల మీద ప్రత్యేక దృష్టి సారించి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ఈ విషయంపై ప్రస్తుత ప్రభుత్వం తో మంతనాలు జరుపుతున్నాం అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కూడా మాట్లాడాం వారు సానుకూలంగా స్పందించారు అన్నారు.
మా దురదృష్టం వల్ల శ్రీశైలం కోల్పోయాం.. ఆంధ్రకు ఇవ్వాల్సి వచ్చిందన్నారు. మా తెలంగాణ భక్తుల మీద ప్రత్యేక దృష్టి సారించాలని..టీటీడీ తరుపున తెలంగాణలో ధర్మప్రచార, నిధులను కేటాయించాలన్నారు సురేఖ.
Also Read:మన్మోహన్కు ప్రధాని మోదీ నివాళి
- Advertisement -