- Advertisement -
శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిని వైద్యులతో అడిగి తెలుసుకున్నారు నిర్మాత అల్లు అరవింద్. సంధ్యా థియోటర్ ఘటనలో రేవతి చనిపోవడం బాధాకరం అన్నారు. శ్రీతేజ్ కోలుకుంటున్నాడని…శ్రీతేజ్ కుటుంబానికి రూ. 2 కోట్ల పరిహారం అందించామన్నారు.
అల్లు అర్జున్ రూ.కోటి పరిహారం, సుకుమార్ రూ. 50 లక్షల పరిహారం అందించారన్నారు. శ్రీతేజ్ కుటుంబానికి మైత్రీ మూవీస్ సంస్థ రూ. 50 లక్షల పరిహారం అని..పరిహారం చెక్కులు ఎఫ్‌డీసీ చైర్మన్‌కు అందించారు అల్లు అరవింద్.
శ్రీతేజ్ వేగంగా కోలుకుంటున్నాడన్నారు దిల్ రాజు. పరిహారం సొమ్ము సద్వినియోగం అయ్యేలా చర్యలు..రేపు సీఎం అపాయింట్‌మెంట్ కోరాం అన్నారు. సినీ ప్రముఖులందరూ సీఎంను కలుస్తాం…సీఎం సమావేశంలో మొత్తం సినీ ప్రముఖులు పాల్గొంటారు అన్నారు.
Also Read:TTD: దేవుని కడప బ్రహ్మోత్సవాలు
- Advertisement -