ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా గంటలోపు దర్శనం పై అధ్యయనం చేస్తున్నాం అన్నారు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు. టీటీడీ పాలకమండలి సమావేశం అనంతరం మాట్లాడిన హరీశ్..ఇప్పటికే నాలుగు కంపెనీలు డెమో ఇస్తున్నాయి ..వీరిపై ట్రయిల్ రన్ నిర్వహించి తదుపరి చర్యలు తీసుకుంటాం అన్నారు.
టీటీడీ కార్యక్రమాలు ప్రపంచ వ్యాప్తంగా తీసుకెళ్లాలని సీఎం సూచనలు చేశారు అని తెలిపారు టీటీడీ ఈవో శ్యామల రావు.దీనిపై ఓ కమిటీ వేసి నివేదిక ఇవ్వాలని సూచించాం…స్విమ్స్ కు జాతీయ హోదా కోసం కేంద్రప్రభుత్వానికి విన్నతించామన్నారు. నడక మార్గంలో ఆరోగ్య సమస్యల కారణంగా మరణాలు సంభవించకుండా ప్రత్యేక చర్యలకు ప్రణాళిక తీసుకుంటామన్నారు.
భక్తులకు అందించే సేవలపై ఫీడ్ బ్యాక్ సిస్టం ఏర్పాటు చేస్తామని…తిరుమలలోని హోటల్స్ నాణ్యమైన ఆహారాన్ని అందించేలా నూతన పాలసీ రూపొందిస్తాం అన్నారు.తిరుమలలో జాతీయ బ్రాండెడ్ రెస్టారెంట్లను తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. నాణ్యమైన భోజనం తక్కువ ధరకే అందించేలా ఈ రెస్టారెంట్ లో ఏర్పాట్లు చేస్తాం…అన్నప్రసాదం విభాగంలో పోస్టులకు భర్తీకి, అదనపు పోస్టుల భర్తీకి నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
కంచి కామకోటి విద్యాసంస్థకు రూ. 2 కోట్లు మంజూరు చేశామని…దేశంలోని ప్రతి రాష్ట్ర రాజధానిలో టీటీడీ ఆలయాలు నిర్మిస్తాం అన్నారు.
భక్తులకు అందించే సేవల పై ఫిడ్ బ్యాక్ ని ఏపి డిజిటల్ సహకారంతో స్వీకరించేందుకు నిర్ణయం తీసుకున్నామని…ముంబై లో స్వామి వారి ఆలయం 10 ఎకరాల్లో నిర్మిస్తున్నాం అన్నారు.
నవి ముంబై లో 3.5 ఎకరాల్లో పద్మావతి అమ్మవారి ఆలయం నిర్మించడానికి విన్నతి వచ్చిందని…క్యూలైన్ లో టాయిలెట్స్ కట్టాల్సిన అవసరం ఉందన్నారు. 3 కోట్లతో టాయిలెట్స్ కాంప్లెక్స్ నిర్మాణానికి ఆమోదం తెలిపాం అని…ఓ మఠానికి సోకర్జ్ నోటీస్ జారీ చేశాం… ఆ మఠం నుంచి ఇంకా బదులు రాలేదు అన్నారు.మఠం నుంచి బదులు రాగానే తదుపరి చర్యలు తీసుకుంటాం…ఇతర మఠాలపై నిఘా ఉంచేలా చర్యలు తీసుకుంటాం అన్నారు.