మాజీ సీఎం కేసీఆర్, హరీశ్ రావులకు హైకోర్టులో ఊరట లభించింది. భూపాలపల్లి జిల్లా కోర్టు ఇచ్చిన నోటీసులను సస్పెండ్ చేసింది హైకోర్టు. భూపాలపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన రాజలింగమూర్తికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను వచ్చే నెల 7వ తేదీకి వాయిదా వేసింది.
భూపాలపల్లి జిల్లా కోర్టు ఇచ్చిన ఆర్డర్స్ సరిగా లేవని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. భూపాలపల్లి కోర్టుకు విచారణ పరిధి లేదని కేసీఆర్, హరీష్ రావు తరపు న్యాయవాది హైకోర్టు దృష్టికి తెచ్చారు.
మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో అవినీతి జరిగిందని భూపాలపల్లి కోర్టులో రాజలింగం పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు ఈ ఏడాది జులై 10న కేసీఆర్, హరీష్ రావు కు నోటీసులు పంపింది. ఈ కేసును కొట్టివేయాలని కేసీఆర్, హరీష్ రావు డిసెంబర్ 23న తెలంగాణ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. జిల్లా కోర్టుకు రివిజన్ పిటిషన్ ను స్వీకరించే అధికార పరిధి లేనందున ఈ పిటిషన్ ను కొట్టేయాలని హైకోర్టును ఆశ్రయించారు.
Also Read:అల్లు అర్జున్‌పై ప్రశ్నల వర్షం!