- Advertisement -
కాలం కలిసి రాకుంటే ఎవరైనా ఒకటే..!, ఓడలు బండ్లు అవుతుంటాయి…బండ్లు ఓడలు అవుతుంటాయి. ఇదంతా ఎవరి గురించి అంటే… శ్రీలంక మాజీ అధ్యక్షురాలు చంద్రికా బండారనాయకె గురించి. లండన్ నగర వీదుల్లోసామాన్యురాలిగా తిరుగుతున్నారు చంద్రికా.
నాడు ప్రపంచ ప్రసిద్ధి చెందిన శ్రీలంక అధ్యక్షురాలు..నేడు పదవి కోల్పోయిన తర్వాత సాధారణ పౌరురాలిగా మారిపోయారు. అప్పుడు చుట్టూ సెక్యూరిటీ గార్డులు.. ఎంతో మంది అనుచరులు, నాయకులు ఆమె వెంటే ఉండేవారు..ఇప్పుడు ఒంటరిగా నడిచెళ్తున్న దృశ్యం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇలా వెళుతున్న దృశ్యాన్ని చూస్తే ఆలోచన ఒక్కటే …ఏదీ శాశ్వతం కాదు అనేది పూర్తిగా అర్ధమవుతుందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. డబ్బు, పదవి, హోదా అధికారం…ప్రతిఒక్కరు గుర్తు పెట్టుకుంటే చాలు అని చెబుతున్నారు.
Also Read:ఉస్తాద్ …జాకీర్ హుస్సేన్
- Advertisement -