అమెరికాలో తెలంగాణ విద్యార్థి మృతి

0
- Advertisement -

అమెరికాలో మరో తెలుగు విద్యార్థి మృతి చెందాడు.హన్మకొండ జిల్లా కమలాపూర్‌ మండలం మాదన్నపేటకు చెందిన 25 ఏళ్ల బండి వంశీ గ‌తేడాది జులైలో ఉన్నత చ‌దువుల కోసం అమెరికా వెళ్లాడు. అక్కడ మిన్నెసొటాలో పార్ట్‌టైం జాబ్ చేస్తూ.. ఎంఎస్ చ‌దువుతున్నాడు.

ఆదివారం తాను ఉంటున్న అపార్ట్‌మెంట్‌లోని గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఉన్న కారులో శవమై కనిపించాడు. అదే అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న హ‌న్మకొండ జిల్లాకు చెందిన యువ‌కులు ఆదివారం ఉద‌యం వంశీ మృతదేహాన్ని గుర్తించి కుటుంబ సభ్యులకు స‌మాచారం అందించారు. వంశీ మృతితో మాదన్నపేట గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

Also Read:సారీ చెప్పిన సీవీ ఆనంద్

- Advertisement -