మెదక్ చర్చిలో హరీశ్‌ రావు ప్రార్థనలు

2
- Advertisement -

క్రిస్మస్ పండగ నేపథ్యంలో మెదక్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు మాజీ మంత్రి హరీశ్‌ రావు. మెదక్ చర్చి వందేండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న ఇంత గొప్ప కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు.

914లో మెదక్ ప్రాంతంలో తీవ్ర కరువు ఉండేది. ప్రజలు ఆకలితో అలమటించేవారు. చార్లెస్ వాకర్ ఫాస్నెట్ కరువుతో అల్లాడుతన్న ప్రజలను చూసి చలించారు. ఉచితంగా కాకుండా ప్రజలకు పని చూపి, వారి ఆకలి తీర్చాలని సంకల్పించారు. అలా వారిచేత ఏసుక్రీస్తు మందిరం నిర్మిస్తూ, వారి ఆకలిని తీర్చారు. చారిత్రాకమైన ఈ చర్చి మెదక్ జిల్లాలో ఉండటం మనకే కాదు, యావత్ తెలంగాణ రాష్ట్రానికి ఎంతో గర్వకారణం అన్నారు.

వందేండ్లుగా ఆసియాలోనే రెండో అతిపెద్ద క్రైస్తవ పుణ్యక్షేత్రంగా మెదక్ చర్చి వర్ధిల్లుతున్నదని చెప్పారు. చర్చి నిర్మాణాన్ని ఇంగ్లాండ్‌కు చెందిన రెవరెండ్‌ చార్లెస్‌ వాకర్‌ ఫాస్నెట్‌ 1914లో ప్రారంభించారని, 1924 డిసెంబర్‌ 25న పూర్తయిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వారి మనువడు పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. కేసీఆర్ ప్రభుత్వం పోయి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాది పూర్తయింది, కేసీఆర్.. ఒక్క మతమని కాదు, హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్కు ఇలా అన్ని మతాలను సమానంగా గౌరవించి, వారు సంతోషంగా జీవించేలా చూశారు. అన్ని వర్గాలు బాగున్నాయి కాబట్టే హైదరాబాద్, తెలంగాణ భిన్నత్వంలో ఏకత్వం అనడానికి నిదర్శనంగా నిలుస్తుందన్నారు.

Also Read:బన్నీ ఇంటిపై దాడి సరికాదు: సీఎం రేవంత్

- Advertisement -