- Advertisement -
మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. హైకోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. లగచర్ల దాడి ఘటనలో అరెస్టయిన నరేందర్ రెడ్డి ఇప్పటికే బెయిల్పై బయటికి వచ్చారు.
ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ నరేందర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. సోమవారం ఉదయం విచారణ చేపట్టిన ధర్మాసనం ఆయనకు ముందస్టు బెయిల్ మంజూరు చేసింది. విచారణకు సహకరించాలని, రూ.25 వేల సొంత పూచికత్తు సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రతి సోమవారం పోలీస్ స్టేషన్లో హాజరుకావాలని ఆదేశించింది.
Also Read:బన్నీ ఇంటిపై దాడి సరికాదు: సీఎం రేవంత్
- Advertisement -