సుకుమార్ – బన్నీ కాంబోలో వచ్చిన పుష్ప 2…ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేస్తోంది. విడుదలైన ప్రతీ చోటా వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 11 వేల థియేటర్‌లలో రిలీజైన ఈ సినిమాకు రూ.1200 కోట్ల గ్రాస్, రూ. 620 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌గా విలువ కట్టగా తొలి వారంలోనే ఏకంగా రూ.1000 కోట్లను, రెండు వారాలు ముగిసేసరికి రూ. 1400 కోట్ల వసూళ్లు రాబట్టింది పుష్ప 2.
అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రాల్లో మూడో స్థానంలో నిలిచింది. పుష్ప 2 కంటే ముందు దంగల్, బాహుబలి 2 చిత్రాలు నిలిచాయి. అల్లు అర్జున్ జోరు చూస్తుంటే లాంగ్ రన్‌లో ఎస్ఎస్ రాజమౌళి ఎపిక్ మూవీ బాహుబలి 2 కలెక్షన్ల రికార్డులను పుష్ప 2 బ్రేక్ చేస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.
16వ రోజు తెలుగు రాష్ట్రాలలో రూ.2.86 కోట్లు, హిందీలో రూ.12 కోట్లు, తమిళ్, కర్ణాటక, కేరళ + రెస్టాఫ్ ఇండియాలలో రూ. కోటి, ఓవర్సీలో రూ. 32 లక్షల చొప్పున ప్రపంచవ్యాప్తంగా రూ.15 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
Also Read:Look Back 2024: ఈ ఏడాది కీలక సంఘటనలివే