ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఒకొక్క రైతుకి ఎకరానికి రూ. 17,500 బాకీ పడ్డదన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అసెంబ్లీలో మాట్లాడిన కేటీఆర్…మొత్తం 70 లక్షల రైతుల లెక్క తీసుకుంటే.. మొత్తం రూ. 26,775 కోట్లు ఖచ్చితంగా రైతులకు చెల్లించాలని బీఆర్ఎస్ తరుపున కోరుతున్నామన్నారు.
మార్పు మార్పు అంటూ.. పేర్లు మార్పు తప్ప ఇంకేం చేయలేదు..ఒక ఎకరానికి తెలంగాణలోని రైతుకు కాంగ్రెస్ పడ్డ బాకీ రూ. 17,500. మొత్తం డెబ్బై లక్షల రైతుల లెక్క తీసుకుంటే.. మొత్తం రూ. 26,775 కోట్లు ఖచ్చితంగా చెల్లించాలని బీఆర్ఎస్ తరఫున డిమాండ్ చేస్తున్నాం అన్నారు.
గ్రామీణ ఆర్ధిక వ్యవస్థకు రైతులే కేంద్ర బిందువు, ఆ రైతు చల్లగా ఉంటే.. వారి చుట్టూ అల్లుకుని ఉన్న వారందరూ బాగుంటారు…వ్యవసాయ స్థిరీకరణ చేయాలనే ఉద్దేశంతోనే 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్తు రైతులకు అందించాం అన్నారు. గౌరవం అనేది ఇచ్చిపుచ్చుకోవాలి.. వాళ్లు గౌరవిస్తే, మేమూ గౌరవిస్తాం.కేసీఆర్ మీద ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే.. మేము కూడా అలాగే మాట్లాడుతాం అని స్పష్టం చేశారు.
2019-20లో సాగు విస్తీర్ణం 141 లక్షల ఎకరాలని, 2020-21లో సాగు విస్తీర్ణం 204 లక్షల ఎకరాలు అని మీరు ఇచ్చిన నివేదికలోనే ఉంది…సాగు చేసినా చేయకపోయినా సాగు విస్తీర్ణం పెరగాలనే ఉద్దేశంతో రైతుబంధు ఇచ్చాం కాబట్టే.. సాగు విస్తీర్ణం 2 కోట్ల 4 లక్షల ఎకరాలకు పెరిగిందిన్నారు కేటీఆర్.
ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఒకొక్క రైతుకి ఎకరానికి రూ. 17,500 బాకీ పడ్డది
మొత్తం 70 లక్షల రైతుల లెక్క తీసుకుంటే.. మొత్తం రూ. 26,775 కోట్లు ఖచ్చితంగా రైతులకు చెల్లించాలని బీఆర్ఎస్ తరుపున కోరుతున్నాము – కేటీఆర్. pic.twitter.com/EfVNL4T82Y
— Telugu Scribe (@TeluguScribe) December 21, 2024