- Advertisement -
ఈనెల 23న ఉదయం 11 గంటలకు ఆన్‌లైన్‌లో శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్లు విడుదల చేయనున్నట్లు టీటీడీ వెల్లడించింది. 24న ఉదయం 11 గంటలకు ఆన్‌లైన్‌లో రూ.300 ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల చేయనుండగా జనవరి 8వ తేదీ ఆఫ్‌లైన్ లో తిరుపతిలో సర్వదర్శన టోకెన్లు జారీ చేసే అవకాశం ఉంది.
జనవరి 10-19వ తేదీ వరకు వైకుంఠ ద్వారా దర్శనంకు భక్తులకు అనుమతివ్వనున్నారు. టోకెన్లు, టికెట్లు ఉన్న భక్తులకు మాత్రమే దర్శనానికి అనుమతి, టోకెన్ లేని భక్తులు తిరుమలకు రావచ్చు. కానీ దర్శన క్యూ లైన్లలోకి అనుమతించరు.
గోవిందమాల భక్తులకు ఎలాంటి ప్రత్యేక దర్శన సదుపాయం లేదు..వైకుంఠ ఏకాదశి రోజు ఉదయం 4.45 గంటలకు ప్రోటోకాల్ దర్శనాలు ప్రారంభం అవుతాయి. వైకుంఠ ఏకాదశి రోజున అధిక రద్దీ కారణంగా ఆలయంలో వేదాశీర్వచనం రద్దు చేశారు.
Also Read:రాజకీయంగా ఎదుర్కోలేకే అక్రమ కేసులు: కవిత
- Advertisement -