ఛాంపియన్స్ ట్రోఫిపై ఐసీసీ కీలక ప్రకటన!

0
- Advertisement -

గత కొద్దిరోజులుగా ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై సందిగ్దంలో ఉన్న ఐసీసీ కీలక ప్రకటన చేసింది. 2024-27 మధ్య ఐసీసీ మ్యాచ్‌లు హైబ్రిడ్‌ మోడల్‌లోనే జరగనున్నాయని వెల్లడించింది. భారత్ – పాకిస్థాన్ జట్లు.. తమ మ్యాచ్​లను తటస్థ వేదికలపై ఆడేందుకు అంగీకరించడంతో ఈ నిర్ణయం తీసుకుంది. త్వరలోనే ఛాంపియన్స్ ట్రోఫీ పూర్తి షెడ్యూల్​ను ప్రకటిస్తామని వెల్లడించింది.

ఛాంపియన్స్ ట్రోఫీతో పాటు వచ్చే ఏడాది భారత్​లో జరగబోయే మహిళల ప్రపంచ కప్​, 2026లో భారత్ శ్రీలంక సంయుక్తంగా నిర్వహించే టీ 20 ప్రపంచకప్​ కూడా హైబ్రిడ్ మోడల్​లోనే నిర్వహించనున్నారు. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ 2025కు సంబంధించిన తటస్థ వేదిక ఏంటనేది ఐసీసీ వెల్లడించలేదు.

2017లో చివరిసారిగా ఛాంపియన్స్ ట్రోఫీ జరగగా, ఫైనల్లో టీమ్​ఇండియాను ఓడించి పాకిస్థాన్ విజేతగా నిలిచింది. ప్రస్తుతం జరగబోయే టోర్నీలో భారత్‌, పాకిస్థాన్‌తో పాటు మొత్తం 8 జట్లు బరిలోకి దిగనున్నాయి.

Also Read:Look Back 2024: అశ్విన్ కెరీర్‌లో హైలైట్స్ ఇవే!

- Advertisement -