అచ్చంపేటలో నిర్మాణంలో ఉన్న షెడ్డు కూలిస్తే డీపీఓ నిర్మించి ఇవ్వాలని హైకోర్టు తీర్పు ఇచ్చిందన్నారు మాజీ మంత్రి కేటీఆర్. అసెంబ్‌లీ లాబీలో చిట్ చాట్‌గా మాట్లాడిన కేటీఆర్..హైడ్రాలో పేదల ఇళ్ళు కూల్చారు రాష్ట్ర ప్రభుత్వం వారికి ఇళ్ళు నిర్మించి ఇస్తుందా చెప్పాలన్నారు. బీసీలను మోసం చేయడానికే 42 శాతం రిజర్వేషన్లు అన్నారు…ట్రిపుల్ టెస్ట్ పాస్ అయితే బీసీ రిజర్వేషన్లు అమలు అవుతాయి అన్నారు.
42 శాతం స్థానికసంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు అమలు కావాలంటే రాజ్యాంగ సవరణ జరగాలి, రాజ్యాంగ సవరణ చేసేందుకు కాంగ్రెస్,బీజేపీ ముందుకు రావాలన్నారు. బీసీల రిజర్వేషన్ల కోసం రాజ్యాంగ సవరణకు రాజ్యసభలో బిఆర్ఎస్ మద్దతు ఇస్తుందన్నారు.
బీసీల రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో డివిజన్ కోరుతాము, ఫార్ములా ఈ రేస్ అంశంపై ప్రభుత్వానికి చర్చ చేసే దమ్ము లేదన్నారు. నాపైన ఎన్ని కేసులు పెట్టుకున్నా న్యాయపరంగా ఎదుర్కొంటానని చెప్పారు. కేసు పెడతాము అనే వాళ్ల ఎందుకు చర్చ పెట్టరు..రేవంత్ రెడ్డి లీకువీరుడు, ఫార్ములా ఈ కార్ రేస్ లో విషయం ఉంటే చర్చ పెట్టాలన్నారు కేటీఆర్.
Also Read:ఎన్టీఆర్ ఘాట్ జోలికి వస్తే ఊరుకోం: గోపినాథ్