2024 మరికొద్ది రోజుల్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పారు రవిచంద్రన్ అశ్విన్. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో భాగంగా మూడో టెస్టు ముగియగానే రిటైర్మెంట్ ప్రకటించారు అశ్విన్. ఈ 14 ఏళ్ల క్రికెట్ కెరీర్‌లో ఎన్నో మైలురాళ్లను అందుకున్నాడు అశ్విన్.
అంతర్జాతీయ క్రికెట్‌లో 765 వికెట్లు తీశారు అశ్విన్. ఇందులో టెస్టుల్లో 537 వికెట్లు ఉన్నాయి. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో 100 వికెట్లు సాధించిన తొలి బౌలర్‌గా అశ్విన్ రికార్డులకు ఎక్కాడు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ చరిత్రలో (మూడు ఎడిషన్లలో) అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ఘనత సాధించాడు అశ్విన్.
టెస్టు క్రికెట్‌లో 37 సార్లు ఐదు వికెట్లు తీశాడు అశ్విన్. అంతేగాదు టెస్టుల్లో అత్యంత వేగంగా 500 వికెట్లు సాధించిన రెండో బౌలర్‌గా అశ్విన్ నిలిచాడు. టెస్టు క్రికెట్‌లో అత్యధిక సార్లు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ (11సార్లు) సొంతం చేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 300 కంటే ఎక్కువ బౌల్డ్, ఎల్బీడబ్ల్యూఔట్‌లను నమోదు చేసిన ముగ్గురు బౌలర్‌లలో అశ్విన్ ఒకడు.
టెస్టు క్రికెట్‌లో స్వదేశంలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా అశ్విన్ నిలిచాడు. 65 మ్యాచుల్లో 383 వికెట్లు తీశాడు.
Also Read:Look Back 2024:హిట్ కొట్టిన హీరోలు వీరే!