టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ మరోసారి వార్తల్లో నిలిచారు. కొద్ది రోజులుగా విజయ్ దేవరకొండ రిలేషన్ షిప్‌లో ఉన్నారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో స్పందించారు విజయ్. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన విజయ్… సమయం వచ్చినప్పుడు తప్పకుండా అన్ని విషయాలు అందరికి చెబుతానని అన్నారు.
ప్రపంచం తెలుసుకోవాలి, అందరితో షేర్ చేసుకోవాలి అని నేను అనుకున్నప్పుడు తప్పకుండా ఆ విషయాన్ని బయటపెడతానని స్పష్టం చేశారు. అందుకు సమయం రావాలి. దానికంటూ ఒక ప్రత్యేక సందర్భం, కారణం ఉండాలని చెప్పుకొచ్చారు విజయ్.
పబ్లిక్ ఫిగర్‌గా ఉన్నప్పుడు నా పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకోవాలని అందరూ ఆసక్తి కనబరుస్తారు. దానిని నేను వృత్తిలో భాగంగానే భావిస్తాను అని తెలిపారు విజయ్. ప్రస్తుతం విజయ్ ‘VD12’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాకు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తుండగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ ఈ సినిమా నిర్మిస్తున్నారు.
Also Read:KTR: ఎన్టీఆర్ పై పిల్లి కూతలా?