కోమటిరెడ్డి కాబోయే ముఖ్యమంత్రా?

3
- Advertisement -

అసెంబ్లీ లాబీలో కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఆసక్తికర కామెంట్స్ చేశారు. తెలంగాణ వచ్చినా 10 ఏళ్ళ తరువాత కూడా ఆంధ్రమీడియా తెలంగాణ రాజకీయాలను శాసించాలని చూస్తోందని మండిపడ్డారు.

మేము ఏ మాత్రం దీనిని ఒప్పుకోమని…ఎన్టీఆర్ అంటే మాకు గౌరవం ఉంది కానీ ఆంధ్ర మీడియా వక్రీకరించిందన్నారు. కొందరు మమ్మల్ని వివరణ అడుగుతున్నారు..మాకు కూడా ఆత్మ గౌరవం ఉందన్నారు. ఆనాడు ఆత్మగౌరవం కోసమే మేము తెలంగాణ రాష్ట్రం కావాలని పార్లమెంట్లో కొట్లాడినం అని గుర్తు చేశారు కోమటిరెడ్డి.

Also Read:రెడ్ అలర్ట్…జంప్డ్ స్కాం!

మంత్రి పదవి వచ్చేటప్పుడు వస్తుంది.. అది అధిష్ఠానం చూసుకుంటుందన్నారు. ఎమ్మెల్యే వివేకానంద, బాల్క సుమన్ తో రాజాగోపాల్ రెడ్డి మధ్య ఆసక్తికరమైన చర్చ జరిగింది. రాజగోపాల్ రెడ్డి కాబోయే ముఖ్యమంత్రా? మంత్రా? అని అడిగారు వివేకానంద… పదవులు ఇప్పటి వరకు నేను అడుక్కోలేదు, అధిష్ఠానం అనుకున్న వాళ్లకు మంత్రి పదవి ఇస్తుందన్నారు.

మా మీద కావాలని దుష్ప్రచారం చేస్తున్నారు… దుష్ప్రచారం చేస్తున్న వాళ్ళ సంగతి చెబుతాం అన్నారు. ఎన్టీఆర్ అంటే అభిమానం ఉంది.. ఎన్టీఆర్ ఘాట్ కూల్చాలని నేను ఎందుకు అంటాను… అనని మాటను అన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు అన్నారు.

- Advertisement -