రెడ్ అలర్ట్…జంప్డ్ స్కాం!

2
- Advertisement -

కరోనా లాక్ డౌన్ తర్వాత ఆన్ లైన్ పేమెంట్లు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో సైబర్ కేటుగాళ్లు సైతం వివిధ రూపాల్లో రెచ్చిపోతున్నారు. ఏ చిన్న అవకాశం దొరికినా అకౌంట్ల నుండి డబ్బులు కాజేస్తున్నారు. ఇటీవల కొత్తగా సైబర్ మోసగాళ్లు జంప్డ్ అనే కొత్త టెక్నిక్‌తో మోసాలకు పాల్పడుతున్నారు.

తొలుత స్కామర్ తన నంబర్‌ని ఉపయోగించి, మీ ఫోన్‌లోకి డబ్బు యొక్క నిజమైన డిపాజిట్‌ ని మీకు పంపుతారు. మీ అకౌంట్‌లోకి నిజంగా రూ. 5వేలు జమ అవుతాయి. ఈ డబ్బును పంపిన తర్వాత మీ ఫోన్‌కు మెస్సే చేసి ఓ లింక్ పంపిస్తాడు. ఆ లింక్‌ను ఓపెన్ చేసి పిన్ నెంబర్ ఎంటర్ చేస్తే చాలు. మీ అకౌంట్‌లో డబ్బులు గోవిందా.

ఎవరైన అకౌంట్‌లో గుర్తు తెలియని నంబర్ల ద్వారా డబ్బులు వచ్చాయంటే మోసమని గుర్తించాలి. ఒకవేళ బ్యాలెన్స్‌ చెక్ చేయడానికి ముందు మీ ఒరిజినల్ పిన్ నెంబర్ నమోదు చేయకుండా తప్పుడు పిన్ నమోదు చేయండి. దీంతో అవతలి వ్యక్తి బండారం బయటపడుతుంది. బీకేర్ ఫుల్. ఎందుకంటే సైబర్ కేటుగాళ్లు రోజుకో రూపంలో పంజా విసురుతున్నారు. కాబట్టి ఏ చిన్న పొరపాటు చేసినా ఆర్ధికంగా నష్టపోవాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Also Read:Harish:మంత్రులే ప్రశ్నలు అడిగితే ఎలా?

- Advertisement -