భూభారతి చట్టం..సభా హక్కుల ఉల్లంఘన నోటీసు

1
- Advertisement -

శాసనసభ ఆమోదం పొందని భూభారతి బిల్లును చట్టంగా ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ… శాసనసభ్యుల హక్కులకు భంగం కలిగే విధంగా వ్యవహరించినందుకు సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చింది బిఅర్ఎస్ శాసనసభ పక్షం.

భూభారతి చట్ట ప్రకటనలపై సభ హక్కుల ఉల్లంఘన నోటీసు ఇవ్వగా శాసనసభా హక్కుల రక్షణ కోసం స్పీకర్ కు వినతిపత్రం సమర్పించారు. శాసనసభ హక్కులను కాపాడాలన్న భారత రాష్ట్ర సమితి పక్షం కోరింది.

2024 డిసెంబర్ 19న దినపత్రికల్లో చట్ట ప్రకటనలు జారీ చేశారని…ఆమోదం పొందని భూభారతి బిల్లును చట్టంగా ప్రకటించిన ప్రభుత్వ తీరుపై అగ్రహం వ్యక్తం చేశారు. పత్రికల్లో భారీ ప్రకటనల ద్వారా ప్రజలను రాష్ట్ర ప్రభుత్వం తప్పుదోవ పట్టించిందన్నారు. శాసన సభ్యుల హక్కులకు భంగం కలిగించే విధంగా వ్యవహారించడం సరికాదని, శాసనసభలో చర్చ దశలో ఉన్న బిల్లును చట్టంగా ప్రభుత్వం పేర్కొందన్నారు.

నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజలను మోసగించిన చర్య అని…రాష్ట్ర శాసనసభ గౌరవానికి దెబ్బతీసిన ప్రభుత్వమని అరోపించింది బీఆర్‌ఎస్ శాసనసభా పక్షం.

Also Read:31 మందితో జేపీసీ..ప్రియాంకకు చోటు!

 

- Advertisement -