తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. మంత్రులే ప్రశ్నలు అడిగితే ఎలా చెప్పాలన్నారు మాజీ మంత్రి హరీశ్ రావు. కొత్త సంస్కృతిని సభలో తీసుకురావద్దని స్పీకర్‌ను కోరారు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో కోమటిరెడ్డి మంత్రిగా ఉన్నారని, వారి హయాంలోనే మూసీ మురికి కూపంగా మారిందన్నారు. అప్పుడు వారు సరిగ్గా చేసిఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని చెప్పారు.
మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నల్లగొండ జిల్లాలోని నీటి సమస్యలను గురించి సంబంధిత మంత్రిని ప్రశ్నించారు. దీనిపట్ల హరీశ్‌రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రశ్నోత్తరాల్లో మంత్రి కోమటిరెడ్డి మాట్లాడటం ఏంటని, ఒక మంత్రి మరో మంత్రిని ప్రశ్నించడం ఏంటన్నారు.
ఏ హోదాలో అడుగుతున్నారని హరీశ్‌రావును మంత్రి కోమటిరెడ్డి ప్రశ్నించారు. ఆయనకు అడిగే హక్కు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. హరీశ్‌రావు మాట్లాడే అవకాశం ఇవ్వొద్దని స్పీకర్ ప్రసాద్ కుమార్‌కు సూచించారు. ఎస్‌ఆర్‌ఎస్పీ స్టేజ్ 2 పనులు పూర్తిచేసి కాళేశ్వరం జలాలను నల్లగొండ జిల్లా, సూర్యాపేట, తుంగతుర్తి, కోదాడ ప్రజలకు అందించేదే బీఆర్‌ఎస్ పార్టీ అని చెప్పారు. మంత్రులు లేచి రాజకీయ ప్రసంగాలు చేస్తే తాము కల్పించుకోవాల్సి వస్తుందన్నారు.
ALso Read:TTD: శ్రీవారి ఆర్జితసేవా టికెట్ల కోటా విడుదల