జానపద కళారూపం..మొగిలయ్య

4
- Advertisement -

ప్రముఖ జానపద కళాకారుడు బలగం మొగులయ్య మృతిపట్ల బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సంతాపం తెలిపారు. ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్ చేసిన కేటీఆర్… పాట ద్వారా తెలంగాణ ప్రేమైక జీవనాన్ని ఆవిష్కరించారని చెప్పారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఆకాంక్షించారు.

బేడ బుడగ జంగాల జానపద కళారూపం ‘శారద కథల’కు బహుళ ప్రాచుర్యం కల్పించి, ఆ కళకే గొప్ప బలగంగా నిలిచిన మొగిలయ్య మరణం బడుగుల సంగీత సాహిత్య రంగానికి తీరని లోటని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ బాధాకర సమయంలో పస్తం మొగిలయ్య సతీమణి కొమురమ్మతోపాటు వారి కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మొగిలయ్య వరంగల్‌లోని ఓ ప్రైవేటు దవాఖానలో చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారని తెలిసిందే.

Also Read:31 మందితో జేపీసీ..ప్రియాంకకు చోటు!

- Advertisement -