పసుపు తాడుతో సినిమా ప్రమోషన్స్‌లో!

2
- Advertisement -

హీరోయిన్ కీర్తి సురేష్ వివాహం ఇటీవల గోవాలో జరిగిన సంగతి తెలిసిందే. చిరకాల ప్రియుడు ఆంటోనీతో కలిసి ఏడు అడుగులు వేసింది ఆంటోని. హిందూ, క్రిస్టియన్ పద్దతిలో పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా జరిగింది.

త్వరలో తన తొలి హిందీ సినిమా బేబీ జాన్‌తో బాలీవుడ్‌లో అడుగుపెట్టనుంది కీర్తి సురేష్. ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమంలో పాల్గొంది కీర్తి. పసుపు తాడుతో కీర్తి సురేష్ కనిపించి అందరిని ఆశ్చర్యపరిచారు. మెడలో మంగళ సూత్రం ఒక్కటే కాదు… కాళ్లకు రాసిన పారాణి కూడా ఇంకా ఆరలేదు. మోడ్రన్‌ డ్రెస్‌లో మెడలో పసుపు తాడుతో ఉన్న కీర్తి సురేష్ లుక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

డిసెంబర్ 25న బేబీ జాన్ సినిమా థియేటర్లలోకి రానుంది. వరుణ్ ధావన్ హీరోగా నటించిన చిత్రం ఇది. దళపతి విజయ్ హీరోగా అట్లీ దర్శకత్వం వహించిన కోలీవుడ్ సూపర్ హిట్ ‘తెరి’కి హిందీ రీమేక్.

Also Read:జమిలీ ఎన్నికలు..రాజ్యాంగంపై దాడినే!

- Advertisement -