హీరో మంచు మనోజ్ ఒకటి అనుకుంటే దైవం ఇంకొటి తలచింది. తాను చెప్పాలనుకుంది ఒకటి కానీ అది వేరోలా అర్ధం రావడంతో మనోజ్‌తో సహా అంతా ఖంగుతిన్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే గురువారం(జూన్ 15) ఒక్కడు మిగిలాడు మూవీ టీజర్ రిలీజ్ కాబోతుంది. దీని తర్వాత మరో సినిమా చేస్తున్నానని.. అదే యాక్టర్ గా తనకు చివరి సినిమా అని ట్వీట్ చేశారు. మనోజ్ ట్వీట్ టాలీవుడ్ లో సంచలనమైంది. ఇటు ఫ్యాన్స్ తో పాటు అతని సహ నటులు షాక్ అయ్యారు.
కొద్ది నిమిషాల్లోనే మనోజ్ ట్విట్ వైరల్ కావడంతో ఆపోస్ట్ డిలీట్ చేసి మరో కొత్త పోస్ట్ పెట్టారు. తాను చేయబోయే కొత్త సినిమా ప్రకటించడానికే ఇలా వినూత్నంగా ఆలోచించానని సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అంతేగాదు వావ్. మీడియా డార్లింగ్స్ నుంచి ఇంత అనూహ్య స్పందన వస్తుందని అనుకోలేదు. చాలా మంది నా పోస్ట్‌ను రకరకాలుగా అర్థం చేసుకున్నారు. నేను చేయబోయే కొత్త సినిమా గురించి నా స్టైల్‌లో ప్రకటించాలనుకున్నాను. కానీ అది ఇలా అవుతుందని అనుకోలేదు. నేను నా కొత్త సినిమా గురించి చెప్పాలంటే ఈ వేడి చల్లారాలి. ఓం శాంతి’ అని మనోజ్ పోస్ట్ చేశారు.
మనోజ్ ఇలా ట్విట్ చేశాడో లేదో సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు షికార్లు చేశాయి. వ్యాపార రంగంలోకి అడుగుపెడుతున్నట్టు ఒకరంటే.. లేదు తమ సొంత ప్రొడక్షన్ హౌజ్ లను చూసుకుంటారని మరొకరంటున్నారు. దీంతో ఈ వార్తలకు పుల్ స్టాప్ పెడుతు మనోజ్ క్లారిటీ ఇచ్చారు.