Look Back 2024:హిట్ కొట్టిన హీరోలు వీరే!

15
- Advertisement -

2024 ఈ సంవత్సరం హీరోలకు బాగా కలిసివచ్చిందనే చెప్పాలి. ముఖ్యంగా కొంతకాలంగా హిట్ కోసం చూస్తున్న ప్రభాస్‌కు కల్కి రూపంలో బిగ్గెస్ట్ హిట్ కొట్టారు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రభంజనాన్ని సృష్టించింది. బాక్సాఫీస్ వద్ద 1000 కోట్లు వసూలు చేసిన సౌత్ ఇండియా మూవీగా రికార్డు క్రియేట్ చేసింది.

జూనియర్ ఎన్టీఆర్ నటించిన మూవీ దేవర . ఈ మూవీ కూడా 2024లో బ్లాక్ బస్టర్ మూవీ గా నిలిచింది. ఈ బ్లాక్ బస్టర్ మూవీకి కొరటాల శివ దర్శకత్వం వహించారు. నార్త్ ఇండియాలో అత్యంత వేగంగా 1 మిలియన్ ప్రీ సేల్ టికెట్స్ అమ్మిన తొలి ఇండియన్ మూవీ గా అరుదైన రికార్డును క్రియేట్ చేసింది.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ డిసెంబర్ 5న పుష్ప 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. పుష్ప 2 సినిమాలో ఎవరు ఊహించని విధంగా 12 వేలకు పైగా థియేటర్లలో రిలీజ్ అయి ఇండియన్ ఫిలిం హిస్టరీలో సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. కేవలం ఆరు రోజులలోనే 1000 కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసింది. అల్లు అర్జున్ కెరీర్ లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ గా నిలిచిందనే చెప్పాలి.

Also Read:Look Back 2024:ఈ హీరోలకు అస్సలు కలిసిరాలేదు!

- Advertisement -