Look Back 2024:ఈ ఏడాది పెళ్లిచేసుకున్న సెలబ్రెటీలు వీరే!

4
- Advertisement -

2024 టాలీవుడ్‌లో పలువురు సెలబ్రెటీలు వివాహం చేసుకున్నారు. వారి వివరాలను పరిశీలిస్తే. అగ్రహీరోయిన్‌ రకుల్ ప్రీత్ సింగ్‌ ఈ ఏడాది పెళ్లి పీటలెక్కారు. బాలీవుడ్ నిర్మాత, తన చిరకాల మిత్రుడు జాకీ భగ్నానీతో కొన్నేళ్ల పాటు ప్రేమాయణం నడిపించిన ఆమె అతనితో ఈ ఏడాది ఫిబ్రవరిలో ఏడాడుగులు వేశారు. సినీ నటి అదితి రావు హైదరి .. హీరో సిద్ధార్ధ్‌తో సుదీర్ఘకాలంగా ప్రేమలో ఉన్నారు. తెలంగాణలో వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఆలయంలో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది.

నటుడు కిరణ్ అబ్బవరం తన కోస్టార్ రహస్య గోరఖ్‌‌తో ప్రేమలో పడ్డారు. కొద్దిరోజుల పాటు ప్రేమ జీవితాన్ని ఎంజాయ్ చేసిన ఈ జంట ఆగస్టులో పెళ్లి పీటలెక్కారు. శరత్ కుమార్ గారాలపట్టి వరలక్ష్మీ శరత్ కుమార్ తన చిరకాల మిత్రుడు, బాయ్‌ఫ్రెండ్ నికోలాయ్ సచ్‌దేవ్‌తో ప్రేమలో పడి ఆయనను పెళ్లాడింది.

మహానటి ఫేం కీర్తి సురేష్ తన చిన్ననాటి మిత్రుడు ఆంటోనీ తట్టిల్‌ను వివాహం చేసుకున్నారు. దాదాపు 15 ఏళ్ల పాటు ప్రేమలో ఉన్న ఈ ముద్దుగుమ్మ.. గోవాలో హిందూ , క్రిస్టియన్ సాంప్రదాయాల ప్రకారం వీరి పెళ్లి జరిగింది. అక్కినేని నాగార్జున పెద్ద కుమారుడు నాగచైతన్య హీరోయిన్ శోభిత ధూళిపాళ గత కొన్నేళ్లపాటు ప్రేమించుకుని ఈ ఏడాది ఎంగేజ్‌మెంట్ చేసుకుని షాకిచ్చారు. హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో జరిగిన వీరి విహానికి సినీ, రాజకీయ, క్రీడా రంగాల ప్రముఖులు తరలివచ్చి వధూవరులను ఆశీర్వదించారు.

అలాగే నటుడు సుబ్బరాజు 47 ఏళ్ల వయసులో స్రవంతి అనే అమ్మాయిని వివాహం చేసుకుని షాకిచ్చాడు. స్టార్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి నవంబర్‌లో డాక్టర్ ప్రీతి చల్లాను వివాహం చేసుకున్నారు. కలర్ ఫోటో సినిమాకు దర్శకత్వం వహించిన సందీప్‌ రాజ్‌ను హీరోయిన్ చాందిని రావు పెళ్లాడారు. టాలీవుడ్ సీనియర్ నటుడు మురళీ మోహన్ మనవరాలు రాగ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణిల కుమారుడు శ్రీసంహాల వివాహం ఘనంగా జరిగింది.

Also Read:Look Back 2024:ఈ హీరోలకు అస్సలు కలిసిరాలేదు!

- Advertisement -