Look Back 2024:ఈ హీరోలకు అస్సలు కలిసిరాలేదు!

2
- Advertisement -

2024 మరి కొద్దిరోజుల్లో ముగియనుంది. ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద ఎన్నో సినిమాలు సత్తాచాటగా పలు హీరోలు హిట్ కొట్టారు. సంక్రాంతి రేసులో ‘గుంటూరు కారం’తో వచ్చారు మహేష్ బాబు. అయితే నెగటివ్ రివ్యూలు రావడంతో బాక్సాఫీస్ వద్ద ఢీలా పడ్డారు మహేశ్ బాబు.

అలాగే సంక్రాంతి రేసులో వచ్చిన మరో హీరో విక్టరీ వెంకటేష్. సైంధవ్‌తో వచ్చిన వెంకటేశ్…నిరాశ పర్చాడు. కింగ్ నాగార్జున ‘నా సామిరంగా’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాకు విజయ్ బిన్నీ దర్శకత్వం వహించగా ఈ సినిమా సైతం ప్రేక్షకులను నిరాశ పర్చింది.

మాస్ మహా రాజా రవితేజకు కూడా 2024 కలిసి రాలేదని చెప్పాలి. ఈగల్, మిస్టర్ బచ్చన్ అనే సినిమాలతో ప్రేక్షకుల ముందుకురాగా ఈ రెండు సినిమాలు నిరాశపర్చాయి. అలాగే పలువురు హీరోలకు 2024 నిరాశనే మిగిల్చింది.

Also Read:Look Back 2024: ఈ సినిమాల గురించే తెగవెతికారు!

- Advertisement -