ఈ ఏడాది టాలీవుడ్‌లో ఎన్నో హిట్, ఫ్లాప్ చిత్రాలువచ్చాయి. కొన్ని చిత్రాలు బాక్సాఫీస్‌ను షేక్ చేస్తే మరికొన్ని చిత్రాలు దారుణ ఫ్లాప్‌ని మూటగట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో ఈఏడాది హిట్, ఫ్లాప్ అయిన సినిమాలను ఓసారి పరిశీలిస్తే..
సంక్రాంతి రేసులో వచ్చిన సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం తొలిరోజుల్లో మంచి టాక్ వినిపించినప్పటికీ తర్వాత వసూళ్లను రాబట్టలేకపోయింది. తివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ మూవీ నిర్మాతలకు నష్టం తెచ్చిపెట్టలేదు కానీ, లాభాలు మాత్రం కురిపించలేకపోయింది. ఈ ఏడాది విడుదలైన అత్యంత భారీ పాన్ ఇండియా చిత్రం కల్కి. దాదాపు 1200 కోట్ల రూపాయల రాబట్టగా ప్రభాస్ తో పాటు నాగ్ అశ్విన్‌కు మంచిపేరు తెచ్చిపెట్టింది.
జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర మరో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఇక మరో హిట్ సినిమా పుష్ప 2.విడుదలకు ముందే వెయ్యి కోట్లు రాబట్టిన ఈ చిత్రం వడిడుదల తర్వాత కూడా మేజిక్ చేసింది. పదిరోజుల్లోనే వెయ్యి కోట్ల మార్క్‌ను అందుకుంది. అలాగే తేజ సజ్జ నటించిన హనుమాన్ బాక్సాఫీస్ వద్ద వండర్ సృష్టించింది. నాని నటించిన సరిపోదా శనివారం, దుల్కర్ సల్మాన్ నటించిన లక్కీభాస్కర్ కూడా హిట్ సినిమాల జాబితాలో చేరింది. అలాగే మత్తు వదలరా 2తో పాటు కొన్ని చిన్న సినిమాలు సైతం మంచి వసూళ్లను రాబట్టాయి.
Also Read:Year Ender 2024: ఎన్నికల్లో గెలిచిన..ఓడిన నేతలు వీరే!