రోజులు మారుతున్న కొద్ది మన అలవాట్లలో కూడా చాలానే మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఒకప్పుడు ఉదయం నిద్ర లేవగానే కల కృత్యాలు తీర్చుకొని ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నమై ఎంతో చురుకుగా, ఉల్లాసంగా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఉదయం నిద్ర లేచినది మొదలు మళ్ళీ పడుకునే వరుకు బద్దకం, అలసట, నీరసం వంటి వాటితో రోజును గడిపేస్తున్నాము. ఇంకా చెప్పాలంటే మన పనులు మనం చేసుకోవడానికి కూడా అలసటగా భావిస్తుంటాము. అయితే ఇవన్నీ దూరం చేసుకోవాలంటే రోజంతా యాక్టివ్ గా పని చేయాలంటే కొన్ని అలవాట్లు మనం అలవరచుకోవాలి.
ప్రతిరోజూ ఉదయం నుంచి రాత్రి వరకు రోజంతా ఫుల్ యాక్టివ్ గా ఉండాలంటే ప్రతిరోజూ వ్యాయామం చేయడం తప్పనిసరి అంటున్నారు నిపుణులు. అయితే కొంతమంది వ్యాయామం చేయడానికి కూడా సమయం కేటాయించే వీలు ఉండదు. అలాంటి వారు ప్రతిరోజూ పరిగెత్తడానికి ( రన్నింగ్ ) సమయం కేటాయిస్తే సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు.
వ్యాయామం చేసినా, ఆటలు ఆడినా, నడక నడిచినా, పరుగెత్తినా ఎంతోకొంత ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. అయితే ఇది క్రమం తప్పకుండా ప్రతిరోజూ ఉదయమో, సాయంత్రమో చేయాలి. శరీరంలో ఉండే కొవ్వు, ఇతర వ్యర్థాలు కొంతమేరకు చెమట రూపంలో పోతాయి. శరీరం దృఢంగానూ, ఆరోగ్యం మెరుగ్గానూ మారుతుంది.
ప్రతిరోజూ నడవటం వల్ల శరీరంలో ఉండే ఎండార్ఫిన్లు అనే హార్మోన్లు విడుదలవుతాయి. ఇవి మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్, కంగారు వంటి సమస్యలు తగ్గుతాయి. ప్రతిరోజూ నడిచినా, పరుగెత్తినా గుండె సమస్యలు తగ్గుతాయి. మధుమేహం ఉన్న వారు నిత్యం నడిస్తే చాలా ప్రయోజనాలు ఉంటాయి. ఆరునెలలపాటు క్రమం తప్పకుండా నడక లేదా పరుగు చేసిన కొందరు మధుమేహ రోగులను పరిశీలించగా వారి రక్తం స్థాయిలో గ్లూకోజ్ స్థాయిలో బాగా అదుపులోకి వచ్చినట్లుగా శాస్త్రవేత్తలు గుర్తించారు.
అలాగే కంటి నిండా నిద్రపడుతుంది. క్యాన్సర్ల ముప్పు తగ్గుతుంది. కీళ్లు, ఎముకలు దృఢమవుతాయి. నీరసం, అలసట, నిస్సత్తువ తగ్గుతాయి.
Also Read:సినీ ప్రముఖులంతా సీఎంను కలుస్తాం: దిల్ రాజు