రాజ్యసభకు మెగాస్టార్?

7
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి మరోసారి రాజకీయ రంగప్రవేశం చేయబోతోన్నారా? పెద్దల సభకు నామినేట్ కానున్నారా? ఇదివరకట్లా మళ్లీ హస్తినలో మళ్లీ చక్రం తిప్పబోతోన్నారా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఫలానా పార్టీ అనే ముద్ర పడకుండా తటస్థంగా ఉంటూనే మళ్లీ రాజకీయాల్లో క్రియాశీలకంగా మారబోతోన్నారనే ప్రచారం సాగుతోంది.

ఏ పార్టీతో సంబంధం లేని తటస్థులకు రాష్ట్రపతి కోటాలో సభ్యత్వం రాష్ట్రపతి కోటాలో రాజ్యసభలో పన్నెండు మంది సభ్యులు ఉంటారు. దేశంలోని వివిధ రంగాల్లో సుప్రసిద్దులైన వారిని ఎంపిక చేసి రాజ్యసభ సభ్యత్వం ఇస్తూంటారు. ఇప్పటికే విజయేంద్ర ప్రసాద్ ఈ కోటాలో టాలీవుడ్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. రంజన్ గొగోయ్, సుధామూర్తి వంటి వారు కూడా సభ్యులుగా ఉన్నారు. ఈ కోటాలో రాజ్యసభ సభ్యుడు అవ్వాలంటే ఆయా రంగంలో దిగ్గజం అయితే సరిపోతుంది. సినీ రంగంలో చిరంజీవి ఎప్పుడో దిగ్గజంగా మారారు. నామినేట్ కావడానికి బీజేపీ సభ్యత్వం కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు.

రాష్ట్రపతి నామినేట్ చేయాల్సిన రాజ్యసభ స్థానాలు ప్రస్తుతం నాలుగు ఖాళీ ఉన్నాయి. వాటిలో ఎవరెవర్ని నియమించాలన్నదానిపై కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఆ నాలుగింటిలో ఒకటి చిరంజీవికి ఖరారు చేశారన్న సమాచారం రాష్ట్ర రాజకీయవర్గాలకు చేరుతోంది. నాగబాబు రాజ్యసభ రేసులో ముందున్నా.. ఇద్దరినీ రాజ్యసభకు పంపడం సముచితం కాదన్న ఉద్దేశంతో నాగబాబును రాష్ట్ర రాజకీయాల్లోనే ఉంచారని చెబుతున్నారు. పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటనలో ఇప్పటికే ఈ అంశంపై చర్చించారని మొత్తం ఫైనల్ అయిందని అధికారిక ప్రకటనే మిగిలి ఉందని భావిస్తున్నారు. రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు మెగాస్టార్ నామినేట్ అయితే.. జనసైనికుల ఆనందానికి అవధులు ఉండకపోవచ్చు.

ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ లో విలీనం అయిన తర్వాత పవన్ సైలెంటయ్యారు. చిరంజీవికి కూడా రాజకీయాలు విరక్తి పుట్టడంతో వైదొలిగారు. వైసీపీ రాజ్యసభ సీటు ఆఫర్ చేసినప్పటికీ తాను ఇక ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానని తేల్చేశారు. అయితే పవన్ కల్యాణ్ మాత్రం చిరంజీవిని మరో సారి పెద్దల సభలో చూడాలని అనుకుంటున్నారు. కానీ చిరంజీవి మాత్రం తాను జనసేనలో అయినా..మరో పార్టీలో అయినా సభ్యత్వం తీసుకునే విషయంలో సుముఖంగా లేరు. అందుకే పవన్ కల్యాణ్ మధ్యేమార్గంగా మరో ప్లాన్ ఆలోచించారు. దాన్ని బీజేపీతో చర్చించారు. అదే రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు నామినేట్ చేయడం.

Also Read:అల్లు అర్జున్‌కు రిలీఫ్.. బెయిల్ మంజూరు

- Advertisement -