- Advertisement -
అల్లు అర్జున్‌పై నమోదైన కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. సంధ్య థియేటర్ ఘటనలో చనిపోయిన రేవతి భర్త భాస్కర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ కేసును విత్ డ్రా చేసుకుంటానని తెలిపాడు. అల్లు అర్జున్ ను విడుదల చేయాలని కోరాడు. థియేటర్లో జరిగిన తొక్కిసలాట ఘటనతో అల్లు అర్జున్‌కు సంబంధం లేదని పేర్కొన్నాడు.
బన్నీపై పోలీసులు నాలుగు కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. 105, 118(1), రెడ్ విత్ 3/5 BNS సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. BNS 118(1) కింద ఏడాది నుంచి పదేళ్ల శిక్ష పడే అవకాశం ఉంది. అల్లు అర్జున్ అరెస్ట్ విషయం తెలుసుకుని ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.
Also Read:అల్లు అర్జున్ అరెస్ట్‌ను ఖండించిన హరీశ్ రావు
- Advertisement -