- Advertisement -
అల్లు అర్జున్ అరెస్ట్‌పై స్పందించారు సీఎం రేవంత్ రెడ్డి. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో చిట్ చాట్‌గా మాట్లాడారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని తెలిపారు. చట్టం ముందు అంతా సమానమేనని స్పష్టం చేశారు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఒకరు చనిపోవడంతో పోలీసులు చర్య తీసుకున్నారని ఇందులో తన జోక్యం ఉండదని స్పష్టం చేశారు.
హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్య థియేటర్లో జరిగిన ఘటనపై అల్లు అర్జున్‌పై నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు.105, 118(1), రెడ్ విత్ 3/5 BNS సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. BNS 118(1) కింద ఏడాది నుంచి పదేళ్ల శిక్ష పడే అవకాశం ఉంది. వైద్య పరీక్షల నిమిత్తం బన్నీని నాంపల్లి కోర్టులో హాజరుపర్చారు.
Also Read:అల్లు అర్జున్ అరెస్ట్‌పై కేటీఆర్
- Advertisement -