2024 మరో 20 రోజుల్లో ముగియనుండగా ఈ ఏడాది వివిధ రంగాల వారిగా ప్రజలు ఎక్కువగా సెర్చ్ చేసిన అంశాలను వెల్లడించింది గూగుల్. ఇక ఈ ఏడాది ఎక్కువగా సెర్చ్ చేసిన రంగాల్లో ప్రథమ స్థానంలో నిలిచింది స్పోర్ట్స్. దేశంలో క్రీడలు అంటే గుర్తుకొచ్చేది క్రికెటే. అత్యంత ఆదరణ పొందిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ అగ్రస్థానంలో నిలిచింది. గూగుల్ ఓవరాల్ జాబితాలోనూ ఐపీఎల్‌దే టాప్ ప్లేస్.
ఐపీఎల్‌తో పాటు టీ 20 ప్రపంచ కప్, ఒలింపిక్స్, ఇండియన్ సూపర్ లీగ్, ప్రోకబడ్డీ లీగ్, కోపా అమెరికా, ఉమెన్స్ ప్రీమియర్ లీగ్, యూఈఎఫ్‌ఏ యూరో, దులీప్ ట్రోఫీ గురించి ఎక్కువగా వెతికేశారు.
మ్యాచ్‌ల విషయానికొస్తే ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ vs చెన్నై సూపర్ కింగ్స్ , చెన్నై సూపర్ కింగ్స్ vs పంజాబ్ కింగ్స్ మ్యాచ్‌ల గురించి ఎక్కువగా వెతికారట. అంతర్జాతీయ మ్యాచ్‌ల విషయానికొస్తే ఇండియా vs బంగ్లాదేశ్ , ఇండియా Vs జింబాబ్వే , శ్రీలంక vs ఇండియా , ఇండియా vs అఫ్గానిస్థాన్ , ఇండియా vs దక్షిణాఫ్రికా , ‘ ఇండియా vs పాకిస్థాన్ , పాకిస్థాన్ vs ఇంగ్లాండ్ మ్యాచ్‌ల గురించి ఎక్కువగా సెర్చ్ చేశారు.
Also Read:పాకిస్థాన్ కోచ్‌గా జేసన్ గిలెస్పీ రాజీనామా..