ఎట్టకేలకు జర్నలిస్టుపై దాడి ఘటనపై క్షమాపణ చెప్పారు నటుడు మోహన్ బాబు. అతడికి, అతడి కుటుంబానికి కలిగిన బాధకు నేను తీవ్రంగా చింతిస్తున్నాను. హృదయపూర్వకంగా క్షమించమని కోరుతున్నా. త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నా అని లేఖలో పేర్కొన్నారు.
నా కుటుంబ ఘటన ఇలా పెద్దదిగా మారుతుందని అనుకోలేదు. తీవ్ర ఆందోళన కారణంగా నేను టీవీ9 జర్నలిస్టులను ఆవేదనకు గురి చేసినందుకు చింతిస్తున్నాను. ఆ తర్వాత నా ఆరోగ్యం బాగోలేని కారణంగా వెంటనే స్పందించ లేకపోయాను. 48 గంటల పాటు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నాను. అందుకే ఆవేశంలో జరిగిన ఘటనలో జర్నలిస్టుకు గాయం అవడం చాలా బాధాకరంగా ఉంది. ఆయన కుటుంబానికి, టీవీ9 కి మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్పుకుంటున్నా అని మోహన్ బాబు ఎక్స్ లో పోస్ట్ చేసిన లేఖలో పేర్కొన్నారు.
— Mohan Babu M (@themohanbabu) December 13, 2024
Also Read:Bigg Boss 8: గౌతమ్‌ని హీరో చేసిన బిగ్ బాస్