Harishrao:తెలంగాణకు నెంబర్ 1 విలన్‌… కాంగ్రెస్

4
- Advertisement -

సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందన్నారు మాజీ మంత్రి హరీశ్‌ రావు. సంగారెడ్డిలో మీడియాతో మాట్లాడిన హరీశ్‌ రావు…రేవంత్ రెడ్డి చరిత్రలో ఏ రోజు జై తెలంగాణ అనలేదు…ఉద్యమంలో పాల్గొనలేదు అన్నారు. డిసెంబర్ 9న తెలంగాణ ఏర్పాటు ప్రకటన వచ్చిందంటే కారణం కేసీఆర్ అన్నారు. కానీ ఎవరో దయతో వచ్చిందని సీఎం చెబుతుంటే ఇది తెలంగాణ ఉద్యమం, అమరులను అవమాన పరచడమేనన్నారు.

తెలంగాణకి నంబర్ వన్ విలనే కాంగ్రెస్ పార్టీ…2001 లో కేసీఆర్ పార్టీ పెట్టకపోతే తెలంగాణ అనే మాటే లేదు కదా అన్నారు. తెలంగాణ అనే పదం అసెంబ్లీలో ఆనాడు నిషేధించారు….50 ఏళ్ల కాంగ్రెస్ పాలన, 16 ఏళ్ల టీడీపీ పాలనలో తెలంగాణ అనే పదం లేకుండా చేశారు అన్నారు. కేసీఆర్ కేంద్ర మంత్రిగా ఉండి డిల్లీలో 32 రాజకీయ పార్టీలను ఒప్పించి తెలంగాణకు అనుకూలంగా లేఖలు తెప్పించారు అన్నారు.

2004 నుంచి 2009 వరకు మాతో పొత్తు పెట్టుకుని తెలంగాణ ఇవ్వకుండా మోసం చేసిన పార్టీ కాంగ్రెస్…నవంబర్ 29 లేకపోతే డిసెంబర్ 9 ప్రకటన లేదు అన్నారు. డిసెంబర్ 9న తెలంగాణ ప్రకటన లేకపోతే జూన్ 2 లేదు…ఆనాడు రేవంత్ రెడ్డిని తెలంగాణ కోసం రాజీనామా చేయమంటే రాజీనామా చేయలేదు అన్నారు. చంద్రబాబుని రాజీనామా చేయమంటే తుపాకీ పట్టుకుని వచ్చాడు రేవంత్ రెడ్డి…చిదంబరం నుంచి తెలంగాణ ప్రకటన వచ్చిందంటే దానికి కారణం కేసీఆర్ అన్నారు.

ఈ సత్యాన్ని ఏమార్చాలని కాంగ్రెస్ చూస్తోంది…నెహ్రూ, గాంధీ పోరాటం వల్ల కాదు బ్రిటిష్ వాళ్లే దయతలిచి స్వాతంత్ర్యం ఇచ్చారు అన్నట్టు రేవంత్ రెడ్డి మాటలు ఉన్నాయి అన్నారు. తెలంగాణ గురించి సీఎం రేవంత్ ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది…లేకుంటే నీ రెండు కళ్ళ సిద్ధాంతం గుర్తుకు వస్తుందన్నారు. సొంయాగాంధీని బలి దేవత అన్న రేవంత్ రెడ్డినే ఇప్పుడు అదే నోటితో దేవత అంటున్నారు…తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చి మేమే తెలంగాణ తెచ్చామని చెబితే అయిపోతోందా…ఎక్కడ అధికారికంగా తెలంగాణ తల్లి విగ్రహం పెట్టలేదు అని సీఎం రేవంత్ చెప్పారు…సంగారెడ్డి కలెక్టరేట్ లో జూన్ 2 2015లో అధికారికంగా పెట్టాము అన్నారు.గ్రామాల్లో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహాలను రేవంత్ రెడ్డి ఇప్పుడు తొలగిస్తారా..?,జూన్ 22 2023నాడు సెక్రటేరియట్ వద్ద కేసీఆర్ తెలంగాణ తల్లి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు…తెలంగాణలో ఉన్న తెలుగుతల్లి విగ్రహాన్ని ఎవరైనా మార్చారా చెప్పాలన్నారు.

Also Read:ఆర్బీఐ గవర్నర్‌గా సంజయ్ బాధ్యతల స్వీకరణ

- Advertisement -