ఆర్బీఐ గవర్నర్‌గా సంజయ్ బాధ్యతల స్వీకరణ

0
- Advertisement -

ఆర్బీఐ నూతన గవర్నర్‌గా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి సంజయ్‌ మల్హోత్రా బాధ్యతలు స్వీకరించారు. నేటి నుంచి మూడేండ్లపాటు ఆర్బీఐ గవర్నర్‌గా సంజయ్‌ మల్హోత్రా బాధ్యతల్ని నిర్వర్తించనున్నారు.

ఇప్పటి వరకూ గవర్నర్‌గా సేవలందించిన శక్తికాంత దాస్‌ పదవీకాలం డిసెంబర్‌ 10 తో ముగిసిన సంగతి తెలిసిందే. ఐఐటీ కాన్పూర్‌ నుంచి కంప్యూటర్‌ సైన్స్‌లో ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేషన్‌ను పూర్తిచేసిన సంజయ్‌ మల్హోత్రా.. అమెరికాలోని ప్రిన్స్‌టన్‌ యూనివర్సిటీ నుంచి పబ్లిక్‌ పాలసీలో మాస్టర్స్‌ డిగ్రీని సైతం పొందారు. 33 ఏండ్ల తన కెరియర్‌లో ఎన్నో ప్రభుత్వ రంగ శాఖల్లో మరెన్నో బాధ్యతల్ని నిర్వహించారు.

రిజర్వ్‌ బ్యాంక్‌ 25వ గవర్నర్‌గా 6 ఏండ్లు పనిచేశారు శక్తికాంత దాస్. అప్పటి గవర్నర్‌ ఊర్జిత్‌ పటేల్‌ అనూహ్య రాజీనామాతో 2018 డిసెంబర్‌ 12న ఈ పదవిలోకి వచ్చారు. 1980 తమిళనాడు కేడర్‌ ఐఏఎస్‌ అధికారి అయిన దాస్‌.. కేంద్ర ఆర్థిక శాఖలోని వివిధ హోదాల్లో పనిచేశారు.

Also Read:పవన్‌,యుఎస్ ఎన్నికలు..వెతికింది వీటి గురించే!

- Advertisement -