Bigg Boss 8 Telugu: అప్పటివరకు పెళ్లి చేసుకోను!

1
- Advertisement -

బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ 8 తెలుగు విజయవంతంగా 100 రోజులు పూర్తి చేసుకుంది. తాజా ఎపిసోడ్‌లో మరోసారి తన బ్రేకప్ గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు నిఖిల్. బ్రహ్మముడి సీరియల్ హీరోయిన్ దీపిక రంగరాజు (కావ్య) హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. నిఖిల్‌ని సీరియస్‌గా ఓ ప్రశ్న వేసింది కావ్య. నీకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది.. తనకి గతంలో నువ్వంటే చాలా ఇష్టం.. కానీ ఇప్పుడు ఇష్టం కాదు..అలా అని ఆ అమ్మాయి వేరే పెళ్లి చేసుకోలేదు.. మరోవైపు మీ ఇంట్లో నువ్వు పెళ్లి చేసుకోవాలని మీ అమ్మ నుంచి ప్రెజర్ వస్తుంది దీనిపై మీ సమాధానం ఏంటని ప్రశ్నించింది.

ప్రేమ ఉందంటే నేను నిజంగా వెయిట్ చేస్తా.. ఎన్ని ఏళ్లయినా ఖచ్చితంగా వెయిట్ చేస్తా.. అమ్మవాళ్లు చెప్పిన సంబంధం చేసుకోను.. నేను మూ ఆన్ అవ్వలేదు అని ఒక్క నిమిషం ఆలోచించకుండా చెప్పేశాడు నిఖిల్. ఈ మాటలకి కావ్య క్లాప్స్ కొట్టింది.

తర్వాత కావ్య.. హౌస్‌మేట్స్‌లో ఒకరిని సెలక్ట్ చేసుకొన ఒక గేమ్ ఆడాలంటూ బిగ్‌బాస్ చెప్పాడు. దీంతో అవినాష్‌తో ఒక గేమ్ ఆడింది. ఇందులో అవినాష్ ఈజీగా గెలిచాశాడు. వెళ్లేముందు నిఖిల్‌కి ఒక టైట్ హగ్ ఇచ్చి నీ కష్టానికి తగ్గ ప్రతిఫలం తప్పక దక్కుతుంది అంటూ దీపిక చెప్పింది.

Also Read:Bigg Boss 8 Telugu:ఓటింగ్ షురూ

- Advertisement -