Pushpa 2: నాలుగు రోజుల్లో రూ.829 కోట్లు

2
- Advertisement -

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం పుష్ప ది రూల్. డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బ్లాక్ బాస్టర్ హిట్ అయింది. నాలుగు రోజుల్లోనే రూ.829 కోట్ల వ‌సూళ్ల‌ను సాధించింది. మ‌రో రెండు రోజుల్లో ఈ చిత్రం రూ.1000 కోట్లు క్రాస్ చేస్తుంద‌ని ట్రేడ్ వ‌ర్గాల అంచ‌నా.

హిందీలో తొలి రోజు రూ.72 కోట్లు, రెండో రోజు రూ.59 కోట్లు రాబ‌ట్టింది. ఇక మూడో రోజు అయితే ఏకంగా రూ.74 కోట్ల వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. దీంతో మొద‌టి రోజున‌ సాధించిన రూ.72 కోట్ల క‌లెక్ష‌న్లు అధిగ‌మించి త‌న రికార్డును తానే తిర‌గరాశాడు అల్లు అర్జున్.

 

Also Read:Rewind 2024: సీక్వెల్స్ సినిమాల్లో హిట్ ఎన్నో తెలుసా?

- Advertisement -