- Advertisement -
నటరత్న పద్మశ్రీ డా. యన్.టి. రామారావు నటించిన ప్రప్రథమ చిత్రం “మన దేశం” 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా డిసెంబర్ 14వ తేదిన విజయవాడలో పెద్ద ఎత్తున వేడుకను నిర్వహించనున్నారు.
తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి, తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి, తెలంగాణా స్టేట్ చలన చిత్ర వాణిజ్య మండలి, తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్, తెలుగు సినీ రైటర్స్ అసోసియేషన్, తెలుగు సినీ దర్శకుల సంఘం ప్రతినిధి అందరూ కలిసి పై ఈ వేడుక గురించి చర్చించారు. ఈ వేడుకకు సినీ ప్రదర్శకులు, సినీ పంపిణీదారులు, సినీ నిర్మాతలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొననున్నారు.
Also Read:సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొనండి: పొన్నం
- Advertisement -