అక్రమ నిర్బంధాలు, అరెస్టుల పట్ల మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను ఎక్కడికక్కడ అరెస్టులు, నిర్బంధాలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా నివాళులర్పించేందుకు వెళ్ళనివ్వకుండా ఈ నిర్బంధాలు ఎందుకు? అని ప్రశ్నించారు.
ఇది నీ నిరంకుశ, నియంతృత్వ పాలనకు నిలువుటద్దం…ఒకవైపు ప్రజా పాలన విజయోత్సవాలు అని ప్రచారం చేసుకుంటూ, మరోవైపు రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీని ప్రకటించావు అని మండిపడ్డారు. మీ అప్రజాస్వామిక విధానాలు, రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతున్న వైఖరిని చూసి హైదరాబాద్ నడిగడ్డ పై ఉన్న అంబేద్కర్ సైతం నివ్వెరపోతున్నడు…అదుపులోకి తీసుకున్న మా @BRSparty నాయకులు, కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం అన్నారు హరీశ్ రావు.
Also Read:అక్రమ అరెస్ట్‌లే మార్పా?: హరీశ్ రావు