Harish Rao: రాక్ష‌స పాల‌న‌..హరీశ్‌ ఫైర్

2
- Advertisement -

ఇది ప్ర‌జాస్వామ్య పాల‌న కాదు.. రాక్ష‌స పాల‌న అని మండిపడ్డారు మాజీ మంత్రి హరీశ్‌ రావు. ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్ చేసిన హరీశ్‌… ఫోన్ ట్యాపింగ్ చేశారంటూ ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళ్తే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై ఉల్టా కేసు బనాయించారు అన్నారు.

ఉదయాన్నే పదుల సంఖ్యలో పోలీసులు ఎమ్మెల్యే ఇంటి మీదకు వచ్చి అక్రమ అరెస్టు చేసే ప్రయత్నం చేశారు. ఈ దుర్మార్గాన్ని ప్రశ్నిస్తే, నాపై, బీఆర్ఎస్ నాయకులపై దుర్మార్గంగా ప్రవర్తించారు అని మండిపడ్డారు. నీ పిట్ట బెదిరింపులకు, అక్రమ కేసులకు భయపడే వాళ్ళం కాదు. తెలంగాణ సమాజమే నీకు బుద్ధి చెబుతుంది అని దుయ్యబట్టారు.

 

Also Read:మాజీ మంత్రి హరీశ్‌ రావుకు బిగ్ రిలీఫ్

- Advertisement -