KTR: అక్రమ కేసులకు భయపడం.. ప్రశ్నిస్తూనే ఉంటాం

3
- Advertisement -

ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ప్రశ్నిస్తూనే ఉంటామని, పోరాడుతూనే ఉంటామని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డి.. ఫిర్యాదు చేయడానికి చేయడానికి వస్తున్నారని తెలిసి ఏసీపీ పరారయ్యారని, సీఐ పారిపోతారన్నారు.

ఎంత అధికార పార్టీకి ఊడిగం చేస్తే మాత్రం ప్రతిపక్ష ఎమ్మెల్యేను అధికారికంగా మీ ఆఫీసులోనే కలిసేందుకు కూడా భయమా అని పోలీసులను ప్రశ్నించారు. పట్టుకొని నిలదీస్తే అక్రమ కేసులు పెడతారా అని నిలదీశారు. ఇదెక్కడి రాజకీయమని, ఇదేనా ప్రజా పాలన, ఇందిరమ్మ రాజ్యం అంటూ మండిపడ్డారు. మీ అక్రమాలను ప్రశ్నిస్తే మా ఎమ్మెల్యేలపై కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ ఇవేవీ ప్రజా గొంతుకులైన మాకు అడ్డం కావని పోరాడుతూనే ఉంటామని ఎక్స్‌ వేదికగా స్పష్టం చేశారు.

Also Read:ప్రాణాలు తీసిన పుష్ప-2 ప్రీమియర్ షో!

 

- Advertisement -