ప్రాణాలు తీసిన పుష్ప-2 ప్రీమియర్ షో!

1
- Advertisement -

మహిళా ప్రేక్షకురాలి ప్రాణం తీసింది పుష్ప 2. దిల్‌సుఖ్ నగర్ ఏరియాకి చెందిన రేవతి (39) తన భర్త భాస్కర్, ఇద్దరు పిల్లలు శ్రీ తేజ్ (9) , సన్వీక (7) కలిసి పుష్ప ప్రీమియర్ షో చూడటానికి ఆర్టీసీ రోడ్స్ లోని సంధ్య 70 mmకు వచ్చింది.

అల్లు అర్జున్ సంధ్య థియేటర్ కు వచ్చిన సమయంలో అభిమానులు థియేటర్ గేటు లోపలికి చొచ్చుకు వచ్చారు. ఈ సమయంలో జరిగిన తొక్కిసలాటలో రేవతి, ఆమె కొడుకు శ్రీ తేజ లుఅపస్మారక స్థితిలోకి వెళ్లారు. వెంటనే పోలీసులు విద్య నగర్ లోని దుర్గ భాయి దేశముఖ్ హాస్పిటల్ కు తరలించారు.

రేవతి అప్పటికే మృతి చెందగా, శ్రీ తేజ పరిస్థితి విషమంగా ఉండటంతో బాలుడిని బేగంపేట కిమ్స్ హాస్పిటల్ కు తరలించారు. రేవతి మృతదేహాన్ని దుర్గాబాయి దేశముఖ్ హాస్పిటల్ నుండి గాంధీ మార్చురీకి తరలించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Also Read:ఘనంగా నాగ చైతన్య-శోభిత ధూళిపాళ వివాహం

- Advertisement -