TTD:వైభవంగా లక్ష్మీ కాసులహారం శోభాయాత్ర‌

3
- Advertisement -

తిరుమల శ్రీవారి లక్ష్మీ కాసులహారం శోభాయాత్ర సోమవారం తిరుచానూరులో వైభ‌వంగా జ‌రిగింది. తిరుమల శ్రీ‌వారి ఆల‌యం నుండి అద‌న‌పు ఈవో శ్రీ వెంకయ్య చౌదరి లక్ష్మీ కాసులహారాన్ని తిరుచానూరులోని శిల్పారామం – ప‌సుపుమండ‌పం వద్దకు తీసుకొచ్చారు. అక్క‌డ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంత‌రం మంగళవాయిద్యాలు, భజనలు,కోలాటాల నడుమ శోభాయాత్రగా మాడ వీధుల గుండా శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి తీసుకెళ్లారు.

అమ్మవారి గజ, గరుడ వాహన సేవల్లో లక్ష్మీకాసుల హారాన్ని అలంకరించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా టీటీడీ అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి మీడియాతో మాట్లాడుతూ తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లోని గరుడ సేవ మాదిరిగానే, తిరుచానూరు వార్షిక బ్రహ్మోత్సవంలో శ్రీ పద్మావతి అమ్మవారికి ఐదో రోజు సాయంత్రం గజ వాహన సేవ అత్యంత ప్రాముఖ్యమైనదన్నారు.

Also Read:రేవంత్ రెడ్డి అపరిచితుడు: హరీశ్‌

- Advertisement -