విభజన హామీల అమలులో కేంద్రం విఫలం:దాస్యం

1
- Advertisement -

విభజన చట్టంలో ఇచ్చిన హామీల అమలులో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌ భాస్కర్‌.ఖాజీపేటలో మీడియాతో మాట్లాడిన దాస్యం… వ్యాగన్‌ ఫ్యాక్టరీ తమవల్లే వచ్చిందని కాంగ్రెస్‌ నేతలు ప్రగల్భాలు పలుకుతున్నారని మండిపడ్డారు. వ్యాగన్‌ ఫ్యాక్టరీ ఏర్పాటులో కాంగ్రెస్‌ పాత్ర ఏమీలేదు..కోచ్‌ ఫ్యాక్టరీ కోసం ఆ పార్టీ ఏనాడూ డిమాండ్‌ చేయలేదన్నారు.

కోచ్‌ ఫ్యాక్టరీకి బదులు వ్యాగన్‌ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తుంది…. కోచ్‌ ఫ్యాక్టరీ అవసరం లేదని పార్లమెంటులోనే కేంద్రం వెల్లడించింది. మహారాష్ట్రలో ఎన్నికలు ఉండటంతో లాతూరుకు కోచ్‌ ఫ్యాక్టరీని ఇచ్చారు అన్నారు. వ్యాగన్‌ ఫ్యాక్టరీకి కేసీఆర్‌ 160 ఎకరాలు కేటాయించారు. కాజేపేటలో కోచ్‌ ఫ్యాక్టరీ కోసం పోరాటం కొనసాగిస్తాం. విభజన చట్టంలోనే కేసీఆర్‌ కోచ్‌ ఫ్యాక్టరీ హామీ పెట్టించారు అన్నారు.

నగరంలోని బోడగుట్టలో ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు దాస్యం. దీనికి అయ్యే రూ.10 కోట్ల ఖర్చులో రాష్ట్రం నుంచి రూ.5 కోట్లు ఇస్తామని గత ప్రభుత్వం తెలిపింది. కాజీపేటలో రూ.50 కోట్లతో రైల్వే ఓబర్‌ బ్రిడ్జి నిర్మాణం ప్రారంభించాం అన్నారు.

ALso Read:వెల్‌నెస్ రిట్రీట్‌కు కేటీఆర్

- Advertisement -