కెసిఆర్ లేకపోతే నవంబర్ 29 లేదు. కేసీఆర్ లేకుంటే డిసెంబర్ 9 లేదు .కేసీఆర్ లేకపోతే జూన్ రెండు లేదు. కేసీఆర్ లేకపోతే తెలంగాణ రాష్ట్రం లేదు అన్నారు మాజీ మంత్రి హరీశ్ రావు. సిద్దిపేట జిల్లా దీక్షా దివాస్‌లో పాల్గొని మాట్లాడిన హరీశ్…రేవంత్ రెడ్డి కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తాడట..నవంబర్ 29 రోజు నలుగునూరు చౌరస్తాలో కేసీఆర్ ను అరెస్టు చేసిన ఆనాటి ఆనవాళ్లు లేకుండా చేస్తావా? చెప్పాలన్నారు.
ఖమ్మం జిల్లాలో మూడు రోజులు పెట్టిన ఆనవాళ్ళు లేకుండా చేస్తావా?,డిసెంబర్ 9 నాటి తెలంగాణ రాష్ట్ర ప్రకటన ఆనవాలు లేకుండా చేస్తావా?,ఏ ఆనవాళ్లు లేకుండా చేస్తావు రేవంత్ రెడ్డి? చెప్పాలన్నారు. జూన్ 2న తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన ఆనవాలు లేకుండా చేస్తావా?, జై తెలంగాణ అన్న వారిపై తుపాకీ పట్టుకొని బయలుదేరిన నీ మరకను చెరపలేవు. అది ఎప్పుడు నిన్ను వెంటాడుతూనే ఉంటుందన్నారు. కేసిఆర్ కీర్తిని నువ్వు తుడిచేయలేవు. తెలంగాణ రాష్ట్రం ఉన్నంతకాలం కేసీఆర్ ఉంటారు..లగిచర్లలో గిరిజనులు కొట్టిన దెబ్బకు.. ఫార్మా కంపెనీ ఏర్పాటును రేవంత్ రెడ్డి రద్దు చేసుకున్నాడు అన్నారు.
మెట్రో రైల్ రద్దు, ఫార్మాసిటీ రద్దు,ఇప్పుడు లగిచర్ల ఫార్మా కూడా రద్దు…కొత్త ఉత్సాహంతో అందరం ముందుకు సాగుదాం. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని కొనసాగిద్దాం. జై తెలంగాణ అన్నారు. దీక్ష దివస్ కార్యక్రమంలో ఉద్యమకారులందరిని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది…ఈ కార్యక్రమంలో ఏర్పాటుచేసిన ఫోటో గ్యాలరీ చూస్తే ఆరోజు దీక్షలో కూర్చున్న ఆనాటి ఉద్యమ జ్ఞాపకాలు నెమరు వేసుకున్నట్టు అనిపించిందన్నారు. తెచ్చుకున్న తెలంగాణ పదిలంగా ఉండేందుకు కేసీఆర్ కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు..రాష్ట్ర సాధన కోసం చెమట చుక్కలు చిందించిన ఉద్యమకారులందరినీ పార్టీ తప్పకుండా కాపాడుకుంటుంది. దొంగలను మళ్ళీ పార్టీలో చేర్చుకునే ప్రసక్తే లేదు అన్నారు.
Also Read:RSP: బీఆర్ఎస్ పునర్నిర్మాణంలో భాగస్వామ్యం కండి
నవంబర్ 29 దీక్ష దివస్ కు చాలా ప్రత్యేకత తెలంగాణ ఉద్యమంలో ఉంది… 1956 నుండి మనకు అన్యాయం జరిగిందని తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేస్తూ వచ్చాం.తెలంగాణ ఆంధ్రతో కలిస్తే అన్యాయం జరుగుతుందన్న మేధావుల భయం నిజమైందన్నారు. 1969 ఉద్యమంలో అన్ని పోరాటాలు చేసినా తెలంగాణ రాష్ట్రం రాలేదు. ఎంతోమంది ప్రాణ త్యాగం చేసినా తెలంగాణ రాలేదు.తెలంగాణ వస్తదా రాదా అన్న ఒక సందేహం తెలంగాణ సమాజంలో బలంగా ఉండేదన్నారు. మనం 11 మంది ఎంపీలు గెలిచినప్పుడు కూడా తెలంగాణ రాలేదు అనే భయం ఉండేది..ఝార్ఖండ్, ఛత్తీస్ గడ్ ,ఉత్తరాఖండ్ మూడు కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాక తెలంగాణ రాష్ట్ర ఏర్పాట పై ఆశలు కొమళ్ళీ చిగురించాయన్నారు.