మూసీ బాధితులకు పునరావాసం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని, పార్లమెంట్ ను, దేశాన్ని తప్పుదోవ పట్టించడం సిగ్గు చేటు అని మండిపడ్డారు మాజీ మంత్రి హరీశ్ రావు. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన హరీశ్ రావు..భూసేకరణ చట్టం 2013 ను అమలు చేస్తున్నామని పచ్చి అబద్దం చెప్పారు. మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుపై వాస్తవాలను దాచిపెడుతుందన్నారు. పార్లమెంట్ లో మా ఎంపీ కేఆర్ సురేశ్ రెడ్డి గారు అడిగిన ప్రశ్నకు వచ్చిన సమాధానంతో రాష్ట్ర కాంగ్రెస్ మోసపూరిత వైఖరి బయటపడిందన్నారు.
కేంద్రానికి చెబుతున్నది ఒకటి, ఇక్కడ అమలు చేస్తున్నది మరొకటి…భూసేకరణ చట్టం 2013 కంటే మెరుగైన చట్టాన్ని కేసీఆర్ రూపొంది అమలు చేశారన్నారు.ఆయన కూడా ఒక నిర్వాసిత కుటుంబం నుంచి వచ్చాడు కాబట్టి నిర్వాసితుల గురించి ఆలోచన చేశారు…నిర్వాసితులకు 121 గజాల స్థలంలో ఐఏవై ఇళ్లు కట్టించాలని 2013 చట్టం చెబితే, కేసీఆర్ గారు 250 గజాల స్థలం, డబుల్ బెడ్ రూం ఇల్లు గా మార్చారు అన్నారు.
మూసి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని తప్పు దోవ పట్టించే విధంగా వ్యవహరించిందన్నారు. నష్టపోతున్న బాధితులను ముందు గుర్తించాలి… అలా ఎక్కడా చేయలేదు అన్నారు. అసైండ్ భూమి అయినా, ఎన్ క్రోచ్ మెంట్ అయినా, పట్టా భూమి అయినా, ప్రభుత్వ భూమిలో ఉన్నా అందరికి సమాన హక్కులు ఉంటాయని చట్టం చెప్పింది…ముందుగా ఎనుమరేషన్ జరగాలి. 60 రోజుల సమయం ఇస్తూ దినపత్రికల్లో నోటీసు ఇవ్వాలన్నారు. వచ్చిన అభ్యంతరాలను పరిగణలోకి తీసుకొని పరిష్కరించాలన్నారు.
అప్పుడు ప్రక్రియ ప్రారంభించాలి. కానీ ఇక్కడ నోటీసులు లేవు, డీపీఆర్ లేవు, ఎనుమరేషన్ లేదు,ఇవేవి లేకుండా ఇండ్లు కూలగొట్టి కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇచ్చారు అన్నారు. కేసీఆర్ నాయకత్వంలో కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్, పాలమూరు ఎత్తిపోతలలో గానీ, సీతారామలో గానీ అనేక ప్రాజెక్టుల్లో మేము తెచ్చిన 2014 చట్టం అమలు చేశాం అన్నారు. చట్టం ప్రకారం, ముందుగా పబ్లిక్ నోటీసు ఇవ్వాలి, అభ్యంతరాలు పబ్లిక్ డొమైన్ లో పెట్టాలి. పరిష్కరించి ముందుకు వెళ్లాలి…ఏ ఇల్లు అయినా ఆ ఇంటికి ఆర్ అండ్ బి, పంచాయతీ రాజ్ అధికారులు వెళ్లి పాత ఇంటికి ఎంత విలువ ఉంటుందో అంచనా వేస్తారు. రెండింతలు డబ్బును ఇంటి యజమానికి ఇవ్వాలన్నారు.
Also Read:డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ..Suriya45
ఉపాధి కోల్పోయిన వారికి వేజ్ లాస్ కింద ఏడున్నర లక్షలు ఇవ్వాలి..పెళ్లి కాని వారికి ఐదు లక్షలు ఇవ్వాలన్నారు. పెళ్లి అయిన వారికి 250 గజాల స్థలం, డబుల్ బెడ్ రూం ఇవ్వాలి…ఆ ఇంటికి కరెంటు, రోడ్డు, ఆసుపత్రి దేవాలయాలు ఉండేలా కాలనీ నిర్మించి ఇవ్వాలన్నారు హరీశ్. 2014 చట్టంలో ఒక్కటీ అమలు కాలేదు.నిజానికి డబుల్ బెడ్ రూం ఇళ్లను సేలబుల్ అంటే అన్ని హక్కులతో ఇవ్వాలి..కానీ కేసీఆర్ గారు కట్టించిన ఇండ్లను కేవలం అసైండ్ పేపర్ ఇచ్చి పంపించారు అన్నారు.అంటే వారికి ఆ ఇండ్ల మీద ఎలాంటి హక్కులు ఉండవు…ప్రజలను, పార్లమెంట్ ను కూడా మోసం చేసిండు రేవంత్ రెడ్డి..మున్సిపల్ మంత్రి, ముఖ్యమంత్రి ఆయనే ఉండి ఆయనకు తెలిసి కూడా కేంద్రానికి తప్పుడు సమాచారం అందించారు అన్నారు.
ఖాళీ చేయించిన ఇళ్ళకి ఎవరు బాధ్యులు, కొత్తవి మాత్రమే కూల్చము అని చెబుతున్నరు. మరి ఇప్పటికే కూల్చిన ఇండ్ల సంగతి ఏమిటి అని ప్రశ్నించారు. వాళ్లు అనుభవించిన క్షోభ సంగతి ఏమిటి..హైడ్రా పేరిట పేదల ఇండ్లు కూల్చారు అన్నారు. చిన్న పాప పుస్తకాలు తెచ్చుకుంటా అంటే ఊరుకోలేదు. ఇండ్లు కూల్చారు. ఎవరు బాధ్యులు..కంపెన్సేషన్ ఇచ్చినా వారు పడిన బాధ పోదు అన్నారు. కట్టుబట్టలతో ఇండ్ల నుంచి బయటకు గెంటేసారు..మూసీ విషయంలోనూ అదే పరిస్థితి. కూలిన ఇండ్లకు నష్టపరిహారం ఎలా చెల్లిస్తావు అన్నారు. దుందుకుడు చర్యలతో పేదల ఉసురు పోసుకుంటున్నవు. రాష్ట్రం పరువు తీస్తున్నావు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.