ప్రతీ చిన్న గ్రామానికి ప్రైమరీ స్కూల్, ప్రతీ రెవెన్యూ గ్రామానికి అప్పర్ ప్రైమరీ స్కూల్, హై స్కూల్ ఏర్పాటు చేస్తామని అభయహస్తం మేనిఫెస్టో లో కాంగ్రెస్ పార్టీ ప్రగల్భాలు పలికిందని ఆరోపించారు హరీశ్ రావు. అధికారం లోకి వచ్చి సంవత్సరం కాకముందే జీరో స్కూల్ పేరిట 1,899 స్కూల్ లు, 10 మంది లోపు విద్యార్థులు 4,314 స్కూల్లు మొత్తం కలిపి 6,213 స్కూలన్ని శాశ్వతం గా మూసి వేసే ప్రణాళిక లో భాగంగానే ఆ స్కూల్లో పనిచేసే 5,741 మంది టీచర్లను బదిలీ చేస్తున్నారు.
కేసీఆర్ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడం కొరకు 7,289 కోట్లతో మన ఊరు – మన బడి, ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం సన్న బియ్యంతో పౌష్ఠిక ఆహారం అందించారు.రేవంత్ సర్కారు వచ్చీ రాగానే సిఎం బ్రేక్ ఫాస్ట్ స్కీం రద్దు చేయడం, మన ఊరు మన బడి ప్రోగ్రాం కొనసాగించక పోవడం, పురుగులన్నం, విషాహారంతో మధ్యాహ్న భోజనం వలన ప్రభుత్వ పాఠశాల పరపతి తగ్గి ఎన్ రోల్మెంట్ తగ్గుతోందన్నారు. ఒక్క సంవత్సరం లోనే 6,213 ప్రభుత్వ స్కూల్స్ మూత పడే దుస్థితికి రేవంత్ సర్కారు దిగజార్చిందన్నారు.
ప్రతీ చిన్న గ్రామానికి ప్రైమరీ స్కూల్, ప్రతీ రెవెన్యూ గ్రామానికి అప్పర్ ప్రైమరీ స్కూల్, హై స్కూల్ ఏర్పాటు చేస్తామని అభయహస్తం మేనిఫెస్టో లో ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్ పార్టీ ..
అధికారం లోకి వచ్చి సంవత్సరం కాకముందే
జీరో స్కూల్ పేరిట 1,899 స్కూల్ లు, 10 మంది లోపు విద్యార్థులు… pic.twitter.com/v5CNJRfJOf— Harish Rao Thanneeru (@BRSHarish) November 28, 2024
Also Read:Priyanka Gandhi: ప్రియాంక గాంధీ అనే నేను