అన్ని చోట్లా ఒకే పార్టీ గెలవాలి అని లేదు: భట్టి

3
- Advertisement -

కాంగ్రెస్ పార్టీ జార్ఖండ్ లో గెలిచింది, కర్ణాటకలో గెలిచింది,కేరళ లో గెలిచారు వెస్ట్ బెంగాల్ లో గెలిచారు మధ్య ప్రదేశ్ లో గెలిచారు.. ఒక మహారాష్ట్ర లో ఓడిపోయినం అని చూపిస్తున్నారు అన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. మీడియాతో చిట్ చాట్‌గా మాట్లాడిన భట్టి..గెలిచిన వాటి కోసం ఆలోచన చేయాలి.. అన్ని చోట్లా ఒకే పార్టీ గెలవాలి అని లేదు అన్నారు

దేశంలో బీజేపీ డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది.. కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగిందన్నారు. రిజర్వేషన్ల ప్రాతిపదికన స్థానిక ఎన్నికలపై నిర్ణయం పీసీసీ సీఎం సమావేశం అవుతారు అన్నారు. ఇందిరమ్మ ఇడ్ల పంపిణీ త్వరలో షురూ కాబోతోందన్నారు భట్టి.

రైతు భరోసాపై ప్రభుత్వం కసరత్తు జరుగుతుందని…రైతు భరోసా విధివిధానాలు ఏంటని త్వరలో క్లారిటీ ఇస్తాం అన్నారు. 15 రోజుల్లో 18 వేల కోట్లు కాంగ్రెస్ ప్రభుత్వం వేసిందని…బీజేపీ మతం పేరుతో విడగొట్టింది మేము కలపాలని రాహుల్ గాంధీ కులగణన తీసుకొచ్చారు. ఇపుడు ఎక్ హై తో సాత్ హై అని కొత్త మాట బీజేపీ తెస్తుంది..ప్రియంబుల్ అందరికీ సమాన అవకాశం ఇవ్వాలని చెప్పిందన్నారు.

సీఎం అందుకే ఫుల్ బాడీ చెకప్ చేస్తాం అన్నారు..వెనకబడినోడు వెనకబడే ఉండాలా ?,ఏ కులం ఎంత అని తేలగానే డిబేట్ పెట్టుదాం అన్నారు.

Also Read:Harish:ప్రతిపక్షాల గొంతు నొక్కడం సరికాదు

- Advertisement -